63 spoons in the stomach: ఆశ్చర్యకరమైన ఘటన.. కడుపులో ఏకంగా 63 స్పూన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
63 spoons in the stomach: ఓ వ్యక్తికి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కడుపులో నొప్పి భరించలేక విలవిల లాడారు. తన పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యలు ఆసుపత్రికి తరలించారు. అతనిని అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు తను కడునొప్పి భరించలేనంతగా బాధపడుతుండటంతో ఆపరేషన్ చేసేందుకు సిద్దమయ్యారు. అతని కడుపులో ఏకంగా 63 స్పూన్లు కనిపించడంతో డాక్టర్లు షాక్‌కు గురయ్యారైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ లోని మాన్సూరాపూర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మన్సూరాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోపాడా గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. కుటుంబసభ్యులు మత్తు పదార్థాలు మానేయాలని ఎంతచెప్పిన విజయ్ వినలేదు. దీంతో విసుగుచెందిన కుటుంబసభ్యలు అతడికి ఆ అలవాటును మాన్పించేందుకు షామ్‌లీలోని డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ లో చేర్పించారు. విజయ్ అక్కడ ఓ నెలరోజుల పాటు చికిత్స పొందాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది. డీఅడిక్షన్ సెంటర్ లో ఉన్న విజయ్ కు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. డీఅడిక్షన్ సెంటర్ వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా కుటుంబసభ్యులు వెంటనే ముజఫర్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు విజయ్ కు పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. విజయ్ కడుపులో ఏకంగా 63 స్పూన్లు కనిపించాయి. అయితే.. ఆపరేషన్ చేసిన వైద్యులు వాటిని వెలికితీశారు. విజయ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. డాక్టర్లు, విజయ్ కడుపలో నుంచి స్పూన్లు తీసారు సరే కానీ, ఈ స్పూన్లు అతని కడుపులోకి ఎలా వచ్చాయని వైద్యులకు ప్రశ్నార్థకంగా మారింది. అన్ని స్పూన్లు విజయ్ ఎందుకు తిన్నాడు? ఆస్పూన్లు మింగే సమయంలో కూడా విజయ్ కు గొంతులో ఎలా మింగాడు గుచ్చుకున్న బాధను ఎందుకు భరించాడు? కుటుంబ సభ్యులకు ఎందుకు తెలిపలేదు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ సిబ్బందే విజయ్ ను బలవంతంగా స్పూన్లు తినిపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ విషయంపై విజయ్ ఎంటువంటి ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావు లేపుతోంది.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
UP | 62 spoons have been taken out from the stomach of 32-year-old patient, Vijay in Muzaffarnagar. We asked him if he ate those spoons & he agreed. Operation lasted for around 2 hours, he is currently in ICU. Patient has been eating spoons for 1 year: Dr Rakesh Khurrana (27.09) pic.twitter.com/tmqnfWJ2lY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!