Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల భద్రత, క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి చాందిని చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాయ్ బిస్కెట్ నిర్వహించిన “ది ఆడిషన్ షో” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుని ఒక్కసారిగా కలకలం రేపారు. 2015లో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం ఇస్తామంటూ ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడని చాందిని తెలిపారు.సెట్లో తన తల్లి సమక్షంలోనే మాట్లాడిన ఆ వ్యక్తి, ఆ తర్వాత ఫోన్ చేసి “నువ్వు చూడటానికి అంత బాగుండవు, రంగు కూడా లేవు.. నిన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టాలంటే కన్విన్స్ చేయాలి” అని అన్నాడని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తి చాందినికి ఫోన్ చేసి, “సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి.. నీ కమిట్మెంట్ ఏంటో నేను చూడాలి” అంటూ పరోక్షంగా లైంగిక వేధింపులకు దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో, ఆ వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేసి “మీ అమ్మాయి అసలు చూడటానికి బాగుండదు, ప్రొడ్యూసర్‌ను కన్విన్స్ చేయాలి” అంటూ అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన చాందిని తల్లి, “నువ్వు ఆర్టిస్టుల కోసం చూస్తున్నావా లేక బ్రోకర్ పనులు చేస్తున్నావా? మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు పట్టిస్తాం” అని గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
ఈ సంఘటన తర్వాత సదరు వ్యక్తి పరిశ్రమలో తనపై తీవ్రమైన దుష్ప్రచారం మొదలుపెట్టాడని చాందిని వెల్లడించారు. “చాందినికి పొగరు ఎక్కువ, ఆమెతో పనిచేయడం చాలా కష్టం, కంఫర్టబుల్‌గా ఉండదు” అని రూమర్లు సృష్టించారని, ఆ నెగెటివ్ ముద్ర ఇప్పటికీ తనపై కొనసాగుతోందని చెప్పారు. అయితే, అడ్డదారుల్లో అవకాశాలు పొంది ఈజీగా ఉండటం కంటే డిఫికల్ట్‌గా ఉండటమే మంచిదని ఆమె ధీటుగా బదులిచ్చారు. 2024లో ‘గామి’, ‘ఏవం’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాల ప్రమోషన్ల సమయంలో హైదరాబాద్‌లోని ఒక హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు, ఒక స్టైలిస్ట్ ద్వారా ఓ ప్రొడ్యూసర్ తన వద్దకు వచ్చారని చాందిని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రొడ్యూసర్ “మనం 2015లో ఒక జ్యువెలరీ యాడ్ కోసం మాట్లాడాం” అని గుర్తు చేయగానే… చాందిని వెంటనే స్పందిస్తూ “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అని ఆయన ముఖం మీదే నేరుగా నిలదీశానని చెప్పారు. ఆ మాట వినగానే ఆయన ముఖం మాడిపోయిందని తెలిపారు. మొదట్లో తాను చాలా సాఫ్ట్‌గా ఉండేదాన్నని, కానీ పరిశ్రమలో ఎదురైన ఇలాంటి సంఘటనల వల్లనే తన రక్షణ కోసం ‘డిఫెన్స్ మెకానిజం’గా ఈ రకమైన కఠిన వైఖరిని అలవర్చుకున్నానని చాందిని స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేసే వారితో కలిసి పనిచేస్తానని, తేడాగా ప్రవర్తిస్తే అసలు స్కోప్ ఇవ్వనని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం చాందిని చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!