వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. UMEED పోర్టల్‌లో అన్ని వక్ఫ్ ఆస్తులను (‘వక్ఫ్ బై యూజర్’ హోదా ఉన్న వాటితో సహా) నమోదు చేయడానికి ఆరు నెలల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి ఆరు నెలల గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టం ప్రకారం అందించిన…
Waqf Act: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు నాయకత్వం వహిస్తామని ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) తెలిపింది. అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది. పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ, ఎల్‌జేపీలను విమర్శిస్తూ.. ఆ పార్టీల లౌకిక ముసుగు తొలగిపోయిందని పేర్కొంది.
Waqf Bill: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ముస్లింలకు ప్రయోజనకరం కాకుండా హానికరంగా ఉంటుందని పేర్కొంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసి రసూల్ ఇలియాస్ వార్నింగ్ ఇచ్చారు.
కర్ణాటకలో హిజాబ్‌పై వివాదం చేలరిగి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘హిజాబ్’ ‘పర్దా’లకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడానికి ముస్లిం మహిళలు తప్పనిసరిగా ముందుకు రావాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) పేర్కొంది. “నా ప్రియమైన సోదరీమణులారా, హిజాబ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి, పక్షపాతాన్ని పారద్రోలడానికి, మీరు హిజాబ్‌తో అణచివేయబడలేదని, కానీ దానితో గౌరవంగా మరియు స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సమయాన్ని…