Woman Missing For 20 Years Was found In Pak : 20 ఏళ్ల క్రితం ఉద్యోగం, ఉపాధి నిమిత్తం విదేశాాలకు వెళ్లిన మహిళ తప్పిపోయింది. 20 ఏళ్లుగా మహిళ గురించి వెతికినా.. కుటుంబ సభ్యులు ఆచూకీ కనిపెట్ట లేకపోయారు. తాజాగా ఆ మహిళ ఆచూకీని పాకిస్తాన్ లో కనుగొన్నారు. దీనికి కారణం సోషల్ మీడియానే. సోషల్ మీడియా పుణ్యామా అని సదరు మహిళ తమ కుటుంబాన్ని కలుసుకునే అవకాశం ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన హమీదా బానో (70) 20 ఏళ్ల క్రితం 2002లో దుబాయ్ లో పనిచేసేందుకు వెళ్లింది. అయితే ఏజెంట్ మోసం చేయడంతో పొరుగు దేశం పాకిస్తాన్ లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి పాకిస్తాన్ లోని హైదరాబాద్( సింధ్)లో నిసిస్తోంది. అక్కడే స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లైంది. అయితే ఆ తర్వాత హమీదా బానో భర్త మరణించాడు. ఈ క్రమంలో ఆ మహిళ ధీనగాథ అక్కడి హక్కుల కార్యకర్త వలీవుల్లా మరూఫ్ కు తెలిసింది. అతను ఎలాగైనా ముంబైలో ఉన్న కుటుంబ సభ్యులతో హమీదా బానోను కలపాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బానో వివరాలను పోస్ట్ చేశాడు. ముంబైలోని మరో సామాజిక కార్యకర్త ఖప్లాన్ షేక్, హమీదా బానోకు సహాయపడ్డాడు.
READ ALSO: 5G Spectrum Auction: 5జీ స్పెక్ట్రమ్ వేలంలో జియోనే టాప్ బిడ్డర్
తన గ్రూప్ లో ఉన్న వారందరికీ హమీదా బానో వీడియోను షేర్ చేశాడు ఖప్లాన్ షేక్. చివరకు ముంబై కుర్లా ప్రాంతంలో ఉన్న బానో కుమార్తె యాస్మిన్ బషీర్ షేక్ ను గుర్తించారు. దాదాపుగా 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన అమ్మ చనిపోయిందని భావిస్తున్నట్లు యాస్మిన్ బషీర్ షేక్ అన్నారు. తమ తల్లిని ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వ సహాయాన్ని కోరుతామని యాస్మిన్ షేక్ తెలిపారు. పాకిస్తాన్ హైకమిషన్ ఆశ్రయించాలని ఆ కుటుంబం భావిస్తోంది.