teacher killed after getting stuck in school lift in mumbai: ముంబైలోని ఓ స్కూల్ లిఫ్టులో ఇరుకుని 26 ఏళ్ల టీచర్ మరణించింది. ఉత్తర్ ముంబైలోని శివారు ప్రాంతం మలాడ్ లోని చించోలి బందర్ లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ స్కూల్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. లిఫ్టులో ఇరుక్కున జెనెల్ ఫెర్నాండెస్ అనే మహిళా టీచర్ మరణించింది. ఈ ఏడాది జూన్ లోనే అసిస్టెంట్ టీచర్ గా జెనెల్ స్కూల్లో చేరారు.
జెనెల్ ఫెర్నాండెస్ మధ్యాహ్నం 1 గంట సమయంలో రెండవ అంతస్తులోని స్టాఫ్ రూంకు వెళ్లేందుకు ఆరో అంతస్తులో వేచి ఉంది. ఇదే సమయంలో లిఫ్ట్ వచ్చింది. ఆమె బ్యాగ్ పట్టుకుని లిఫ్టులోకి వెళ్లే క్రమంలో లిఫ్టు డోర్లు వెంటనే మూసుకుని పోయాయి. ఈ క్రమంలో లిఫ్టు డోర్ల మధ్యే ఆమె ఇరుక్కుపోయింది. ఈ సమయంలో లిఫ్టు మూవ్ కావడంతో మధ్యలో ఇరుక్కుపోయిన జెనెల్ ఫెర్నాండెస్ తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో ఆమె మరణించింది.
Read Also: Jharkhand: ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు..
ఆమె ఆరో అంతస్తులో లిఫ్ట్ ఎక్కే క్రమంలో హఠాత్తుగా లిఫ్ట్ డోర్లు మూసుకుపోయాయి. జెనెల్ ఒక కాలు లిఫ్టు లోపల ఉండగా.. మిగతా బాడీ బయట ఉంది. లిఫ్టు ఇలాగే పైనకు వెళ్లింది. ఈక్రమంలోనే జెనెల్ తీవ్ర గాయాలపాలయ్యారు.
పాఠశాల సిబ్బంది ఆమెకు సహాయం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జెనెల్ ఫెర్నాండెస్ ను బయటకు తీసే సమయంలో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం దీనిని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైనా కారణాలు ఉంటే దానిపై చర్యలు తీసుకుంటామని జోన్ 11 డిఫ్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ ఠాకూర్ తెలిపారు.