Shiv Sena: కాంగ్రెస్ లేకుండా అది సాధ్యం కాదు..! స్పష్టం చేసిన సంజయ్ రౌత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే టార్గెట్‌గా మరో ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటుకోసం కొన్ని రాష్ట్రాల సీఎంలు ప్రయత్నాలు చేస్తున్నారు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ఇలా అంతా ఏకతాటిపైకి వస్తున్నారు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కాంగ్రెస్ లేకుండా ఎలాంటి పొలిటికల్ ఫ్రంట్ సాధ్యం కాదని స్పష్టం చేశారు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫ్రంట్‌ను ప్రతిపాదించారని వెల్లడించిన ఆయన.. ఆ సమయంలో కాంగ్రెస్ ను కలుపుకునే ఫ్రంట్ ఉండాలని చెప్పామన్నారు.. అయితే, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు..
Read Also: AIRTEL: సీమీవీ6లో ఎయిర్‌టెల్ భారీ పెట్టుబడులు…
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఇక, కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్చలు కూడా జరలేదన్నారు సంజయ్ రౌత్.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. బీజేపీని ఎదుర్కోవడానికి ఒక ఫ్రంట్ గురించి మాట్లాడినప్పుడు కూడా, కాంగ్రెస్‌ను వెంట తీసుకెళ్లాలని తాము స్పష్టం చేశామన్నారు.. కాగా, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్.. ముంబైలో శివసేన అధినేత మరియు మహారాష్ట్ర కౌంటర్ ఉద్ధవ్ థాకరేను కలిశారు. ఈ సమావేశంలో సంజయ్ రౌత్, నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌తో సమావేశం అయ్యారు.. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేం ఎప్పుడూ చెప్పలేదన్న ఆయన.. ఫ్రంట్ ఏర్పాటు జరిగితే.. కాంగ్రెస్‌ను కలుపుకుపోవాలని మాట్లాడిన మొదటి రాజకీయ పార్టీ శివసేనే అన్నారు.. అయితే, మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో సహా మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి శివసేన నేతృత్వం వహిస్తోన్న విషయం విదితమే.. మరోవైపు, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయ ఐక్యత ప్రక్రియను ఈ చర్చలు వేగవంతం చేస్తాయని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఇప్పటికే పేర్కొంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!