Nagpur: ముగ్గురు పిల్లల తల్లితో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి..
- 36 ఏళ్ల మహిళతో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి..
- మహిళకు అప్పటికే ముగ్గురు పిల్లలు..
- 4 నెలల వేట తర్వాత ఇద్దరి గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(16), 36 ఏళ్ల మహిళతో లేచిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ అప్పటికే ముగ్గురు పిల్లల తల్లి. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్లోనిక్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అతన్ని రక్షించింది. ఈ ఘటనపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సదరు మహిళ విద్యార్థి ఇంటి సమీపంలో నిసించేందని, తరుచుగా వీరిద్దరు ఒకే ఆలయానికి వెళ్లే వారని పోలీసులు తెలిపారు.
నివేదికల ప్రకారం.. టీనేజర్ తండ్రి, తన కూతురి అనారోగ్యం గురించి ఆ మహిళతో మాట్లాడేవాడు. అయితే, ఆ తర్వాత విద్యార్థి ఆ మహిళతో స్నేహం చేశాడు. తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గమనించిన తండ్రి పలుమార్లు అతడిని మందలించాడు. అతడిని, మహిళ నుంచి దూరం చేయడానికి ఓల్డ్ మంగళ్వాడిలోని తన బంధువుల ఇంటికి పంపారు. అయితే, టీనేజ్ విద్యార్థి ఆ మహిళతో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు.
Also Read
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
Read Also: Yogi Adityanath: “హోలీ వర్సెస్ శుక్రవారం నమాజ్”.. పోలీస్ అధికారికి యోగి మద్దతు..
పారిపోయిన తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు లాకాడ్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, కిడ్నాప్ కేసు పెట్టారు. మరోవైపు మహిళ కుటుంబం కూడా స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు తర్వాత పోలీసులు అతడు ఎక్కడున్నాడో కనిపెట్టి, ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మహిళను లకాడ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించామని, అక్కడ కిడ్నాప్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత, మహిళను కోర్టు ముందు హాజరుపరచగా, ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
వీరిద్దరు డిసెంబర్ 2న పారిపోయారు. నాలుగు నెలల తర్వాత వీరిని మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో వీరిని గుర్తించారు. సదరు మహిళ తన బంగారు గొలుసును అమ్మి ఇంటిని అద్దెకు తీసుకుని, ఇంటికి కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసింది. మహిళ క్యాటరింగ్ గ్రూప్‌లో వంట మనిషిగా పనిచేస్తుండగా, టీనేజర్ సర్వీస్ బాయ్‌గా చేరాడు. అయితే, నాగ్‌పూర్ పోలీసులు వీరు ఎక్కడ ఉంటున్నారో గుర్తించి అరెస్ట్ చేశారు. టీనేజన్ తన సోదరికి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయడంతో, వీరు ఎక్కడ ఉంటున్నారనే వివరాలను పోలీసులు గుర్తించగలిగారు. కుటుంబాలు వీరి వింత వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో కూడా వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆ మహిళ పెద్ద కొడుకు వయసు 12 ఏళ్లు. పారిపోయిన టీనేజర్ వయసు కన్నా 4 ఏళ్లు చిన్నవాడు.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..