PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..
- మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని మోడీ ఫైర్..
- బుజ్జగింపు రాజకీయాలకు చెక్ పెడుతామని హామీ..
- బెంగాలీలను మైనారిటీలు కానివ్వమని కామెంట్స్..
- అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో యూసీసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పు వేగవంతంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు తాము ‘‘ఉమ్మడి పౌరస్మృతి’’ తీసుకువస్తున్నామని శనివారం ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బెంగాలీలు మైనారిటీలు కాకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పారు.
ముస్లింల ఆధిపత్యం ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్‌లో బహిరంగం సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సాగిస్తున్న ‘‘మహా జంగిల్ రాజ్’’ పాలనకు ముగింపు పలికేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విడుదల చేసిన బీజేపీ ఎన్నికల మానిఫెస్టో ఒక మార్గసూచిక అని మోడీ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని చెప్పారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..
ఆర్జీకర్ హత్యాచార కేసులో నిందితులకు మమతా సర్కార్ ఎలా అండగా నిలిచిందో రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఆయన అన్నారు. ‘‘మా -మాటీ-మనుష్’’ అనే నినాదంతో టీఎంసీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పుడు చొరబాటుదారుల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ బుజ్జగింపు, ఓట్ బ్యాంక్ రాజకీయాల ఆటను ఇకపై బెంగాల్ సహించదని, రాష్ట్రంలో బెంగాలీలు మైనారిటీలుగా మారడానికి తాము అంగీకరించమని ప్రధాని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరుల్ని జైలుకు పంపుతామని చెప్పారు.
భారత్ అంతా శ్రీరామ నవమి జరుపుకుంటే, బెంగాల్లో టీఎంసీ అండతో రామనవమి ర్యాలీపై దాడులు జరుగుతున్నాయని, హింస చోటుచేసుకుంటుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఖామని భావించి, కుట్రలకు పాల్పడుతూ ఏఐ వీడియోలను వ్యాప్తి చేస్తుందని ప్రధాని ఆరోపించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!