PM Modi: “మోడీ గారు యుద్ధాన్ని ఆపండి”.. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ విజ్ఞప్తి
- మోడీ గారు యుద్ధాన్ని ఆపండి..
- అన్ని దేశాలతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి..
- యూరోపియన్ థింక్ ట్యాంక్ విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ, ప్రపంచంలోని వివిధ రాజకీయ ప్రముఖులు, సంస్థలు ప్రధాని నరేంద్రమోడీ యుద్ధాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అనే థింక్ ట్యాంక్‌లో ఇరాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న అలీ వాజ్ మాట్లాడుతూ.. ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత ప్రధాని నరేంద్రమోడీ చొరవ తీసుకోవాలని, పరిణతి, అనుభవం ఉన్న దేశంగా భారత్ ఈ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించగలదని అన్నారు.
ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అనేది బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక స్వతంత్ర సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలపై నివేదిక అందిస్తుంది. ఇది ఏ ప్రభుత్వానికి లేదా ఏ అధ్యక్షుడి ఆధీనంలో ఉండదు. అలీ వాజ్ ఇరాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, ఇరాన్ సంబంధిత విషయాలకు నాయకత్వం వహిస్తున్నారు. దీనిపై అలీ వాజ్ మాట్లాడుతూ.. అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్న ప్రధాని మోడీ ఉద్రిక్తతలు తగ్గేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
భారత్ నుంచి మరిన్ని చర్యలను ఆశిస్తున్నామని, భారత్ ఎంతో చేయగలని, హార్ముజ్ జలసంధి మూసివేసిన తరుణంలో భారత్ అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఒక ఒప్పందానికి ప్రయత్నించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. ఈ దశలో కాల్పుల విరమణకు అవకాశం లేదని, రెండు పక్షాలు కూడా ఒకరినొకరు దెబ్బ కొట్టగలమని నమ్ముతున్నాయని ఇలాంటి సమయంలో భారత్ చొరవ తీసుకోవాలని అలీ వాజ్ కోరారు.
గతంలో ఇరాన్, అమెరికా యుద్ధాన్ని మోడీ ఆపగలరని కొంత మంది అమెరికన్ నిపుణులు కూడా అనడం గమనార్హం. భారత్ మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వస్తే, అమెరికా అధ్యక్షుడు, ప్రధాని మోదీల మధ్య చర్చలు ముందుకు సాగవచ్చని అమెరికన్ యుద్ధ నిపుణుడు డగ్లస్ మెక్‌గ్రెగర్ అన్నారు. రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి ప్రధాన శక్తుల మధ్య విశ్వాస వారధిగా మారే సత్తా ప్రధాని మోదీకి ఉందని మెక్‌గ్రెగర్ అన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుతూ.. ఆర్థిక,రాజకీయ అస్థిరత కారణంగా పాక్ తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!