Most Expensive Tea: కిలో టీ పొడితో లగ్జరీ విల్లా కొనేయొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.9 కోట్ల ‘చాయ్’ విశేషాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Expensive Tea: చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి టీ పడనిదే రోజు గడవదు. సాధారణంగా కిలో టీ పొడి రూ.300 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. కానీ, ఒక రకమైన టీ పొడి ధర వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ టీ పొడి ధర ఏకంగా రూ.9 కోట్లు. అవును, మీరు చదివింది నిజమే. ఒక కిలో టీ పొడి అమ్మితే ఒక విలాసవంతమైన బంగ్లా లేదా ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఆ టీ పోడి ప్రత్యేకత ఏంటి, ఎందుకని దానికి ఇంత ఖరీదు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Iran-US War: కువైట్ ఎయిర్‌పోర్టు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు
Also Read
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
టీ ప్రత్యేకత ఏంటి, ఎక్కడ దొరుకుతుంది..
ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన ఈ టీ పేరు ‘దా-హోంగ్ పావో’ (Da Hong Pao). దీనిని ‘బిగ్ రెడ్ రోబ్’ అని కూడా పిలుస్తారు. ఇది చైనాలోని ఫుజియాన్ ప్రాంత్లంలో ఉన్న ‘వుయియీ’ పర్వత ప్రాంతాల్లో పండుతుంది. పలు నివేదికల ప్రకారం, ఈ టీ పొడి వేలంలో కిలో రూ.9 కోట్ల వరకు ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. 2002లో కేవలం 20 గ్రాముల ఈ టీ పొడి రూ.26.17 లక్షలకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ టీ ఇంత ఖరీదు అవ్వడానికి ప్రధాన కారణం దాని అరుదైన చరిత్ర, లభ్యత అని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ ఆకులు పర్వతాల్లోని పురాతనమైన ‘మదర్ బుషెస్’ (తల్లి మొక్కల) నుంచి సేకరిస్తారు. ఈ మొక్కలు వందల ఏళ్ల నాటివి. ఈ పురాతన మొక్కల నుంచి ఏడాదికి అతి తక్కువ పరిమాణంలో మాత్రమే ఆకులు లభిస్తాయి.
చైనా జానపద కథల ప్రకారం.. మింగ్ రాజవంశం కాలంలో ఒక రాణి తీవ్ర అనారోగ్యానికి గురైతే, ఈ టీ తాగడం వల్లే ఆమె కోలుకుందట. దానికి గుర్తుగా రాజు ఆ మొక్కలకు ‘ఎర్రటి వస్త్రం’ (Red Robe) కప్పించి గౌరవించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ టీ రుచి చాలా గాఢంగా, మట్టి వాసనతో కూడిన తీపిని కలిగి ఉంటుంది. దీనిని తాగిన తర్వాత ఆ సువాసన, రుచి గొంతులో చాలా సేపు నిలిచి ఉంటుంది. పర్వతాల మధ్య రాతి పగుళ్లలో పెరగడం వల్ల అక్కడి ఖనిజాలను ఇది పీల్చుకుంటుంది, అందుకే దీనిని ‘రాక్ టీ’ అని కూడా అంటారు.
చైనా జాతీయ సంపద
ప్రస్తుతం ఈ పురాతన టీ మొక్కలను చైనా ప్రభుత్వం ‘జాతీయ సంపద’గా ప్రకటించింది. వీటికి రక్షణగా సాయుధ గార్డులను కూడా మోహరించారు. 2006 నుంచి ఈ పాత మొక్కల నుంచి ఆకులు కోయడాన్ని చైనా సర్కార్ నిషేధించింది. దీనివల్ల మార్కెట్లో ఉన్న పాత స్టాక్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ‘దా-హోంగ్ పావో’ టీ.. ఆ పాత మొక్కల కొమ్మల నుంచి పెంచిన కొత్త మొక్కలది. ఇవి కూడా ఖరీదైనవే అయినప్పటికీ, అసలైన ‘మదర్ బుషెస్’ టీతో వీటిని పోల్చలేమని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక కిలో టీ పొడి ధర ఈ రేంజ్‌లో ఉండటం అనేది ప్రజలను ఆశ్చర్యానికిలోను చేస్తుంది.
READ ALSO: Ragi Soup: షుగర్ పేషెంట్లకు వరం, బాన పొట్టను కరిగించే ‘రాగి అస్త్రం’.. 10 నిమిషాల్లో ఇలా చేసేయండి!
తాజావార్తలు
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!