Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి హీట్ పుట్టింది.. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసే అవకాశం లేదని, మూడు నుంచి ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రావచ్చని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఏర్పడలేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు బదులుగా టీవీకేకు 108 స్థానాలే వచ్చాయని గుర్తు చేశారు. ఇటీవల వరకు డీఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం వల్లే విజయ్ ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.
ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు
ప్రస్తుత ప్రభుత్వం చాలా బలహీనమైన స్థితిలో ఉందని, ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమని స్టాలిన్ అన్నారు. మూడు నెలల్లోనైనా, ఆరు నెలల్లోనైనా ఎన్నికలు రావచ్చని పేర్కొంటూ డీఎంకే శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Also Read
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
- Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
తమిళనాడు రాజకీయ సమీకరణాలు
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే 59, ఏఐఏడీఎంకే 47 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు 20 స్థానాలు దక్కించుకున్నాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు టీవీకేకు మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉండగా, తాజాగా వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పి అధికార టీవీకేకు మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Delhi Building Collapse: “రక్షించండి”.. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
-
‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!