Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jon Ossoff: అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక వ్యక్తి పేరు మారుమోగిపోతోంది. అతనే డెమోక్రటిక్ పార్టీ యువ సంచలనం జాన్ ఒసాఫ్ (Jon Ossoff). 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని విజయం సాధించిన జార్జియా గడ్డపైనే.. ఇప్పుడు ఏకంగా ట్రంప్ వర్గానికే దిమ్మతిరిగే షాకిచ్చారు ఒసాఫ్. తాజాగా ముగిసిన యూఎస్ మిడ్‌టర్మ్ పోరులో అత్యంత కీలకమైన సెనేట్ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, కాంగ్రెస్ ఉభయ సభలపై డెమోక్రాట్లు పైచేయి సాధించడంలో వెన్నెముకలా నిలిచారు. ఈ దెబ్బతో 39 ఏళ్ల ఈ యువ నేతను రాజకీయ విశ్లేషకులు మరో ‘బరాక్ ఒబామా’గా అభివర్ణిస్తున్నారు. రాబోయే 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో డెమోక్రాట్ల తరఫున వైట్ హౌస్ బరిలో దిగే ప్రధాన నాయకుడు ఇతనేనంటూ జోరుగా చర్చ మొదలైంది.
ఎపిస్టీన్ క్లాస్.. మారలాగో మాఫియా
2021లో మొదటిసారి గెలిచినప్పుడు జాన్ ఒసాఫ్ను చాలామంది “యాక్సిడెంటల్ సెనేటర్” అని కొట్టిపారేశారు. కానీ ఐదేళ్ల తర్వాత, పూర్తి రిపబ్లికన్ అనుకూల వాతావరణం ఉన్న జార్జియాలో మళ్లీ జెండా పాతడం చిన్న విషయం కాదు. ప్రచారంలో ట్రంప్‌ను ఆయన ఏకిపారేసిన విధానం అమెరికా అంతటా వైరల్ అయింది. ట్రంప్ బృందాన్ని నేరుగా ‘ఎపిస్టీన్ క్లాస్’, ‘మారలాగో మాఫియా’ అంటూ తీవ్ర పదజాలంతో ఒసాఫ్ విరుచుకుపడ్డారు. విజయానంతరం అట్లాంటాలో మాట్లాడుతూ కూడా.. “అమెరికన్ ప్రజలు ట్రంప్ అవినీతిని, అసమర్థతను తిరస్కరించారు. కేవలం అధ్యక్షుడి దుర్మార్గాలను అడ్డుకోవడమే కాదు.. సమాజంలో ఏర్పడిన చీలికలను పూడ్చడమే మన లక్ష్యం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా ఏమాత్రం తొణకకుండా, నిలకడగా ఎదురుదాడి చేయడంలో ఒసాఫ్ సిద్ధహస్తుడని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
Also Read
- Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
- Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
- JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
- Imran Khan: ‘నా భార్యను కాపాడండి.. నా కేసు తర్వాత చూద్దాం’ లాయర్లకు ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్!
ఒబామాను గుర్తుచేస్తున్న బాడీ లాంగ్వేజ్..
ఒసాఫ్ ప్రసంగాల తీరు, బాడీ లాంగ్వేజ్ అచ్చం బరాక్ ఒబామాను పోలి ఉంటాయి. వేదికపైకి రాగానే షర్ట్ చేతులు పైకి మడిచి, అద్భుతమైన గొంతుతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపే ఆయన స్టైల్.. 2008 నాటి యువ ఒబామాను కళ్లముందుంచుతోంది. ఒబామా సైతం స్వయంగా రంగంలోకి దిగి ఒసాఫ్ తరఫున ప్రచారం చేశారు. పౌరహక్కుల నేత జాన్ లూయిస్ వద్ద 17 ఏళ్ల వయసులోనే శిష్యరికం చేసిన ఒసాఫ్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసి, ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీల కంపెనీ సీఈఓగా పనిచేశారు. మానవ అక్రమ రవాణా, యుద్ధ నేరాలపై పరిశోధనలు చేసిన అనుభవం ఆయనకు రాజకీయాల్లో ఎంతగానో అక్కరకొచ్చింది.
2028 వైట్ హౌస్ రేసులోకి దిగుతారా?
ప్రస్తుతానికి తనకు ప్రెసిడెంట్ రేసుపై ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ.. బైడెన్, ట్రంప్ వంటి వయోవృద్ధ నాయకులతో విసిగిపోయిన అమెరికన్ ఓటర్లకు ఒసాఫ్ రూపంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. ఒబామా తర్వాత అంతటి ప్రజాకర్షణ, యువతను ఆకట్టుకునే మాటతీరు ఉన్న లీడర్ మరొకరు లేరన్నది డెమోక్రాట్ల భావన. ట్రంప్ కంచుకోటలోనే విజయఢంకా మోగించిన ఈ యంగ్ సెనేటర్.. 2028లో అమెరికా అధ్యక్ష పీఠం వైపు అడుగులు వేస్తారా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
-
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!