AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC ZPTC Elections: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కొన్ని సమస్యలు వెలుగులోకి రాగా.. ఈ రోజు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని ఘటనలు జరిగాయి.. అయితే, ఇవాళ్టి ఎన్నికపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని వెల్లడించారు. అయితే, ఎన్నికల సందర్భంగా 15 జిల్లాల పరిధిలో మొత్తం 37 ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కడప, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో ఈ ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై పోలీసుశాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టనుంది. పోలింగ్‌కు ఆటంకం కలిగించిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. అలాగే ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు హరీష్ కుమార్ గుప్తా..
Also Read
28 జిల్లాల్లో భారీ పోలీసు బందోబస్తు
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసుశాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల భద్రతా విధుల్లో మొత్తం 40,679 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇక, పోలింగ్ ప్రక్రియ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా తరలించేందుకు పటిష్ట పోలీసు భద్రత కల్పించాలని డీజీపీ ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా నమోదైన 37 ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!