Minister Sridhar Babu: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం పర్యటన కొనసాగుతుంది. ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడులకోసం ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా యుఎస్‌లో మెల్ పెన్నా – EVP, రిక్ రియోబోల్లి – CTO, మైక్ క్రిసాఫుల్లి-CIO , ఇతరులతో కూడిన గ్లోబల్ మీడియా, టెక్నాలజీ కంపెనీ కామ్‌కాస్ట్ యొక్క సీనియర్ లీడర్‌షిప్ టీమ్‌తో చాలా ఆకర్షణీయంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు హాజరు అయ్యారు. వారితో తెలంగాణ పెట్టుబడులపై ప్రస్తావించారు. హైదరాబాద్ లో కామ్‌కాస్ట్ కంపెనీ పెట్టేందుకు సీనియర్ లీడర్‌షిప్ టీమ్‌తో సుధీర్ఘంగా చర్చలు నిర్వహించారు.
Read also: CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
కాగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానం ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా AI వినియోగం గణనీయంగా పెరుగుతుండటంతో, మంత్రుల పర్యటన.. ప్రభావవంతమైన వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. AI గ్లోబల్ సమ్మిట్ చాలా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఈవెంట్‌గా సెప్టెంబర్ 5-6 తేదీలలో జరుగుతుంది. ఇందుకోసం ప్రచార కార్యక్రమాన్ని, వెబ్‌సైట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా ప్రారంభించారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన 2 రోజుల సదస్సు దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది. సదస్సులో చర్చించాల్సిన ప్రధాన అంశాలను ఇప్పటికే ఎంపిక చేసి, వాటిపై అపార అనుభవం ఉన్న నిపుణులతో కీలక ప్రసంగాలు చేసేలా షెడ్యూలు నిర్ణయించారు. ఏఐ ఫర్ సోషల్ చేంజ్, సేఫ్ ఏఐ, పుషింగ్ బౌండరీస్ ఆఫ్ ఇన్నోవేషన్, ప్యారడిగ్మ్ షిఫ్ట్ ఇన్ ఇండస్ట్రీ తదితర అంశాలపై నిపుణులు చర్చిస్తారని.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యోట్టా, ఎన్‌విడియా వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఏఐలో భాగస్వాములుగా పనిచేస్తున్నాయని ఐటీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. వీటితో పాటు పరిశ్రమ భాగస్వాములు హైసియా, సీఐఐ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, నాస్కామ్ నాలెడ్జ్ పార్టనర్‌గా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు సమీర్‌పేటలోని నల్సర్ల యూనివర్సిటీలో ఏఐ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆగస్టు 10న యూనివర్సిటీలో సదస్సు ఉంటుందన్నారు.
Uttarakhand : కేదార్‌నాథ్‌కు వెళ్లే సన్ ప్రయాగ్-గౌరీకుండ్ రహదారిపై విరిగిపడిన కొండచరియలు