Site icon NTV Telugu

Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..

Paki

Paki

Operation Sindoor: భారత్ మరోసారి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవార సాయంత్రం పాకిస్తాన్ భారతీయ నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు చేసింది. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీకి హెడ్ క్వార్టర్‌గా ఉన్న రావల్పిండినే భారత్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: India Pakistan War: రావల్పిండి ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి.. లాహోర్, సియాల్‌కోట్‌లో బాంబుల మోత..

ముఖ్యంగా, పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌బేసుల్ని భారత్ టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టించింది. రావల్పిండిలోని అతి ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై, షార్కోట్‌లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్‌లోని మురిద్ ఎయిర్ బేస్‌పై భారీ దాడులతో విరుచుకుపడింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్‌ని టార్గెట్‌గా భారత్ దాడులు చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో సహా ఇతర ఎయిర్ బేసుల్ని భారత్ టార్గెట్ చేసి దాడులు చేసినట్లు పాక్ మీడియా కూడా వెల్లడించింది. పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్‌పీఆర్ కూడా దాడుల్ని ధ్రువీకరించింది.

రావల్పిండితో పాటు లాహోర్, ఇస్లామాబాద్, సియాల్ కోట్, నర్వాల్ ఇలా పాక్ నగరాల్లో భారత్ విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది. పదే పదే డ్రోన్‌లో భారత్‌‌ని టార్గెట్ చేస్తుండటంతో ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క రావల్పిండిలోనే రెండు మిలిటరీ స్థావరాలపై భారీ దాడులు జరినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు తెలుస్తోంది. లాహోర్‌లోని 10, 11 బెటాలియన్‌లపై దాడి జరిగింది.

Exit mobile version