Pakistan: ఉగ్రవాదుల సామూహిక అంత్యక్రియలు.. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హాజరు, వీడియోలు వైరల్..
- పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు సామూహిక అంత్యక్రియలు.. అంతియ యాత్రలో పాక్ ఆర్మీ, పోలీసులు, ఐఎస్ఐ అధికారులు.. వైరల్ అవుతున్న వీడియోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా జరిపిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపుగా 80 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ రెండు ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న బహవల్పూర్, మురిడ్కేపై దాడులు నిర్వహించడం ఈ ఆపరేషన్‌కే హైలెట్‌గా మారింది.
Read Also: Ponnam Prabhakar: “ఆపరేషన్ సింధూర్” విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రి!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో అనుకున్న సంఖ్య కన్నా ఎక్కువ మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. కీలక ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. వీరందరికి సామూహిక అంత్యక్రియలు చేపడుతున్నారు. వీరి మృతదేహాలపై పాకిస్తాన్ జెండాను ఉంచి నివాళులు అర్పిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎంత మద్దతు ఇస్తుందో తెలుస్తోంది.
ఇన్నాళ్లు మా దేశంలో ఉగ్రవాదులు లేరని బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్, చనిపోయిన ఉగ్రవాదులు అంత్యక్రియల్లో, ఊరేగింపుల్లో పాల్గొనడటం చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీసులు, ఐఎస్ఐ అధికారులు ఉగ్రవాదులకు నివాళులు అర్పిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరంతా ఉగ్రవాదుల అంతిమ యాత్రలో ముందు వరసలో పాల్గొన్నారు.
Multiple funerals of LeT and Jaish terrorists that were eliminated in last night's #OperationSindoor missile strikes in Pakistan.
Pak army and ISI are at the forefront of these funeral processions. pic.twitter.com/nh1UXvRu1g
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 7, 2025
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!