Mansarovar Yatra: మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
- మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యతరం..
- ఘాటుగా స్పందించిన భారత్..
- లిపులేఖ్ మా ప్రాంతమంటూ నేపాల్ వాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansarovar Yatra: ‘‘మానస సరోవర్ యాత్ర’’పై నేపాల్ అభ్యతరం చెబుతోంది. లిపులేఖ్ మీదుగా సాగే ఈ యాత్ర మార్గం నేపాల్ వ్యతిరేకించింది. భారత్, చైనాలకు దౌత్యపరమైన నిరసన తెలిపింది. ఈ పరిణామం తర్వాత భారత్ ఘాటుగా స్పందించింది. కాఠ్మాండు చేస్తున్న ప్రాదేశిక వాదనల్ని తోసిపుచ్చింది. “1954 నుండి కైలాస మానస సరోవర యాత్రకు లిపులేఖ్ కనుమ (Pass) ఒక దీర్ఘకాలిక మార్గంగా ఉంది. ఇది కొత్తగా వచ్చిన పరిణామం ఏమీ కాదు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 3న పేర్కొంది. ఇలాంటి వాదనలు సమర్థనీయం కాదని, అలాగే చారిత్రక వాస్తవాలు, ఆధారాలపై నేపాల్ వాదనలు ఆధారపడి లేవని, నేపాల్ చేస్తున్న ప్రాదేశిక వాదనలు, కృత్తిమంగా విస్తరించుకునే ఇలాంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని భారత్ చెప్పింది. ఇదే సమయంలో చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పింది.
లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ అనే మూడు ప్రాంతాలపై నేపాల్ తన ప్రాదేశిక వాదనల్ని చేస్తోంది. ఈ ప్రాంతాలు చారిత్రాత్మకంగా భారత్‌లో భాగంగా ఉన్నాయి. గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఉన్న సమయంలో ఈ మూడు ప్రాంతాలను నేపాల్ తన మ్యాప్‌లో భాగంగా చూపించింది. ఆ సమయంలో భారత్ నుంచి తీవ్ర స్పందన వచ్చింది.
Also Read
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
Read Also: Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
‘‘1816 సుగౌలి ఒప్పందం ప్రకారం, లింపియాధుర, లిపులేఖ్ మరియు కాలాపాని నేపాల్‌లో అంతర్భాగాలని నేపాల్ ప్రభుత్వం స్పష్టంగా మరియు దృఢంగా ఉంది’’ అని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ పౌడ్యాత్ ఛెత్రి మాట్లాడుతూ.. నేపాల్ తన ఆందోళనలను దౌత్య మార్గాల ద్వారా న్యూఢిల్లీ మరియు బీజింగ్ రెండింటికీ తెలియజేసిందని అన్నారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. లిపులేఖ్ నేపాల్ భూభాగమని చైనాకు తెలియజేసినట్లు చెప్పారు. ఈ వివాదాస్పద ప్రాంతంలో కార్యకలాపాలు నిలిపేయాలని అన్నారు.
ఈ వివాదాస్పద ప్రాంతంలో రహదారుల నిర్మాణం, విస్తరణ, సరిహద్దు వాణిజ్యం, తీర్థయాత్రలకు సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవద్దని భారత్‌ను నేపాల్ కోరింది. ఇదే సమయంలో భారత్ నేపాల్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి నేపాల్ కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?