Site icon NTV Telugu

Mani Shankar Aiyar: నువ్వు చాలు సామి, కాంగ్రెస్‌ను ముంచనీకి..

Congress

Congress

Mani Shankar Aiyar: కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఎవరూ అక్కర లేదు, వాళ్ల పార్టీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఖతం చేసే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో ముందు వరసలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పారేశాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుల్లో ఎన్నికల్లు జరగబోతున్నాయి. ఇందులో కేరళలో మాత్రమే కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి.

Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్‌ సమాచారంపై..!

ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాను ‘‘కీలు బొమ్మ’’గా, శశి థూరూర్‌ను ‘‘పాకిస్తాన్ వ్యతిరేకి’’, ‘‘తదుపరి విదేశాంగ మంత్రి’’ కావాలనే ఆశ ఉందని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్‌ను కూడా ఆయన ఎగతాళి చేస్తూ, “తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి” అని అన్నారు. ఇదే కాకుండా కేరళలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతం అవుతున్న తరుణంలో.. ‘‘రాబోయే ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సీఎం పినరయి విజయన్ మంచి పనులు చేస్తున్నారు’’ అని కితాబు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలవలేదని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన “విజన్ 2031: డెవలప్‌మెంట్ అండ్ డెమోక్రసీ” సెమినార్‌లో, అయ్యర్ కేరళ ముఖ్యమంత్రి మరియు సీపీఎం నాయకుడు పినరయి విజయన్‌ను ప్రశంసించారు.

దీని తర్వాత, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. పవన్ ఖేరా X లో మాట్లాడుతూ, ‘‘మణి శంకర్ అయ్యర్‌కు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఆయన పూర్తిగా వ్యక్తిగత సామర్థ్యంతోనే మాట్లాడతారు’’ అని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని,ఎల్డీఎఫ్-బీజేపీలు రహస్య భాగస్వాములు అని జైరాం రమేష్ అన్నారు.

Exit mobile version