Mamata Banerjee: బీఎస్ఎఫ్పై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..
- బెంగాల్లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు..
- బీఎస్ఎఫ్ కారణం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాక్యలు చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అనుమతిస్తుందని గురువారం ఆరోపించారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ ప్లాన్ కేంద్రం యొక్క ‘‘నీచమైన బ్లూ ప్రింట్’’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ బెంగాల్లోకి చొరబాట్లను అనుమతిస్తోందని, మహిళలను హింసిస్తోందని ఆరోపించారు.
‘‘బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు’’ బెంగాల్లో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కొన్ని రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల తర్వాత మమత నుంచి తాజా కామెంట్స్ వచ్చాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ అంశం టీఎంసీ-బీజేపీ మధ్య చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Read Also: Nimisha Priya case: యెమెన్‌లో నిమిషా ప్రియాకు మరణశిక్ష.. రక్షించేందుకు ఇరాన్ సాయం..
‘‘బీఎస్ఎఫ్ వివిధ ప్రాంతాల నుండి బెంగాల్లోకి చొరబాట్లను అనుమతిస్తోంది మరియు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తోంది, టీఎంసీ సరిహద్దులను కాపాడటం లేదు కదా, సరిహద్దు మన చేతుల్లో లేదు, కాబట్టి ఎవరైనా టీఎంసీ చొరబాట్లను అనుమతించిందని ఆరోపిస్తే, అది బిఎస్ఎఫ్ బాధ్యత అని నేను ఎత్తి చూపుతాను.’’ అని మమతా బెనర్జీ అన్నారు. చొరబాట్లను అనుమతించే ప్రాంతాలను దర్యాప్తు చేసి గుర్తించాలని డీజీపీని ఆదేశిస్తానని చెప్పారు.
పోలీసుల వద్ద సమాచారం ఉందని, కేంద్ర వద్ద కూడా ఉందని, ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌తో మాకు శత్రుత్వం లేదు, కానీ ఇక్కడ గుండాలను అనుమతించి, వారు నేరాలకు పాల్పడిన తర్వాత సరిహద్దు దాటుతున్నారని, బీఎస్ఎఫ్ ఇదంతా చేస్తుందని, దీంట్లో కేంద్రం పాత్ర ఉందని ఆరోపించారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య 4096 కి.మీ సరిహద్దు కలిగి ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ చొరబాట్లకు బెంగాల్ నర్సరీగా మారిందని అన్నారు. ఓట్ల కోసం మమతా బెనర్జీ ఇలా చేస్తున్నారని, బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యాలకు బెంగాల్ గేట్వేగా మారిందని అన్నారు.
- Tags
- Bangladesh
- bjp
- BSF
- Mamata Banerjee
తాజావార్తలు
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
-
Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
-
Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!