Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం

  • పాలకులే హంతకులుగా మారారు
  • బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
  • అభిషేక్ బెనర్జీపై దాడి చేసిన ప్రజలు
Mamata Banerjee

Mamata Banerjee

పాలకులే హంతకులుగా మారారని.. బెంగాల్ బీజేపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనార్‌పూర్‌లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిపై ఎక్స్‌లో స్పందిస్తూ ఫైరయ్యారు. ‘‘వారు సిగ్గుపడాలి.. పాలకులు హంతకులుగా మారారు. బీజేపీకి సిగ్గుచేటు.’’ అని పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సమయంలో
సోనార్‌పూర్‌లో అభిషేక్‌పై దాడి జరిగింది. గ్రామస్తులు ఇష్టానురీతిగా దాడి చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అభిషేక్ బెనర్జీ హెల్మెట్ ధరించి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలని మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీ మద్దతు ఉన్న దుండగులు దారుణంగా దాడి చేసినప్పటికీ… మా జాతీయ ప్రధాన కార్యదర్శి వెనకడుగు వేయలేదని.. పైగా ఆ కుటుంబానికి అండగా నిలిచారని టీఎంసీ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. మమతా బెనర్జీ ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసి ప్రకటన విడుదల చేశారు.

×
×
Ad

“దొంగ.. దొంగ” అంటూ బీజేపీ నినాదాలు
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం కొందరు దాడి చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న బెనర్జీపై రాళ్లు, గుడ్లు విసిరారు. అంతేకాకుండా, కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి, కాళ్లతో తన్నారు. పార్టీలో నంబర్ 2గా పరిగణించే ఆయనపై ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

ఇదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర నిరసనలకు దిగారు. ఆయనను ఉద్దేశించి “దొంగ.. దొంగ” (చోర్.. చోర్) అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ముట్టడించే ప్రయత్నం చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీపై నడిరోడ్డుపై దాడి జరగడం, అదే సమయంలో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించడంతో సోనార్‌పూర్‌లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ చర్యలతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.