Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mamata Banerjee Protesting Doctors Call Off Hunger Strike Mamata Banerjee Speaks To Doctors After Ultimatum

Kolkata: జూడాలకు సీఎం మమత ఫోన్.. డిమాండ్లకు 4 నెలలు సమయమివ్వాలని వినతి

Published Date :October 19, 2024 , 5:07 pm
By Suresh Maddala
  • జూడాలకు సీఎం మమత ఫోన్
  • డిమాండ్ల పరిష్కారానికి 4 నెలలు సమయమివ్వాలని వినతి
Kolkata: జూడాలకు సీఎం మమత ఫోన్..  డిమాండ్లకు 4 నెలలు సమయమివ్వాలని వినతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక వైద్యులకు భద్రత కల్పించాలంటూ గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష చేస్తు్న్నారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా రాజీనామాలు కూడా సమర్పించారు. అయితే ఈ రాజీనామాలను ప్రభుత్వ తిరస్కరించింది. అయితే జూడాల దీక్షపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. వైద్యులు దీక్షను వీడాలని కోరారు. డాక్టర్ల నిరసనలతో పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని.. వైద్య సేవలపై ప్రభావం పడకూడదని చెప్పారు. వైద్యుల డిమాండ్లలో కొన్ని ఇప్పటికే నెరవేర్చామని.. మిగతా వాటి కోసం 3-4 నెలల సమయం ఇవ్వాలని వైద్యులను మమత కోరారు. ఈ విషయంపై చర్చించేందుకు మరోసారి చర్చలకు రావాలని ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: KTR : గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం

జూనియర్‌ డాక్టర్లు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సోమవారం (21-10-2024) రావాలని మమత మరోసారి ఆహ్వానించారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రి దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్‌ వైద్యుల వేదిక దగ్గరకు శనివారం చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్‌ వెళ్లారు. ఈ సమయంలో సీఎం వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. వైద్యులు చేసిన పలు డిమాండ్లను నెరవేర్చడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను ప్రభుత్వానికి వైద్యులు నిర్దేశించడం సరికాదని వ్యాఖ్యానించారు. వైద్యుల డిమాండ్లపై చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వేలో సిబ్బంది కొరత.. రిటైర్డ్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్!

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యంత ఘోరంగా హత్యాచారం జరిగింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు కొనసాగించారు. సీఎం మమతా బెనర్జీ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో.. 42 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gaddam Prasad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్పీకర్.. బలగం సినిమా ఫేమ్ కు ఆర్థిక సహాయం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Doctors after ultimatum
  • Kolkata doctor murder case
  • Mamata Banerjee
  • Mamata banerjee speaks
  • Off hunger strike

తాజావార్తలు

  • Fauzi Movie Leaks: లీకు వీరులకు ‘ఫౌజీ’ టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!

  • Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

  • SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!

  • Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..

  • ZaynMarieKhan : డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ లో పరువాల ప్రదర్శనతో అదరగొట్టిన ‘జైన్ మారియా ఖాన్’

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions