కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో బాధిత కుటుంబానికి పోలీసులు డబ్బులు ఆఫర్ చేశారంటూ గత వారం వార్తలు హల్‌చల్ చేశాయి. బాధితురాలి తండ్రి ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. దీంతో మీడియాలో కథనాలు సంచలనంగా మారాయి. తాజాగా సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. డబ్బులు ఆఫర్ చేసిన వార్తలను ఖండించారు. వామపక్ష పార్టీల ప్రమేయంతో కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. కేవలం ఇదొక అపవాదు మాత్రమేనని కొట్టిపారేశారు.