Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- అమిత్ షాపై మమతా బెనర్జీ ఆగ్రహం..
- టీఎంసీ గుండాలను తలకిందులుగా వేలాడదీస్తామన్న షా..
- ఈ వ్యాఖ్యలపై కేసు పెడుతామని దీదీ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఎంసీ కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన హింసాత్మక వ్యాఖ్యలపై చట్టపరంగా కేసు పెట్టబోతున్నట్లు ఆమె శనివారం తెలిపారు. హోం మంత్రిగా ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
Read Also: KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ గుండాలు ఇకపై ప్రజల్ని బాంబులు, బుల్లెట్లతో భయపెట్టలేరు, బెంగాల్ ప్రజలు వాటికి ఓట్లతో సమాధానం ఇస్తారు’’ అని ఆయన అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వీడుకోలు పలకాలని, అప్పుడు టీఎంసీ గుండాలను తలకిందులుగా వేలాడదీసి దారికి తీసుకువస్తామని ఆయన అన్నారు. మొదటి విడత పోలింగ్‌కు ఒక రోజు ముందు కూడా అమిత్ షా.. టీఎంసీ గుండాలు ఏప్రిల్ 23న ఇళ్లలోనే ఉండాలని, లేకపోతే మే 4 తర్వాత ఒక్కొక్కరిని పట్టుకుని జైలులో పడేస్తామని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘‘ఒక హోం మంత్రి ఎలాంటి భాష వాడుతున్నారు? ఎన్నికల తర్వాత ప్రజలను తలకిందులుగా వేలాడదీస్తామని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. ఈ మనస్తత్వంతో మీరు బెంగాల్‌లో ఎప్పటికీ గెలవలేరు’’ అని అన్నారు. బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి