BJP: రాబోయే బీహార్ ఎన్నికల్లో బురఖా ధరించిన ఓటర్లను చెక్ చేయాలని బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ ఆరోపించింది. పోలింగ్ బూతుల్లో బురఖా ధరించిన మహిళల్ని ధ్రువీకరించాలని నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో జరిగిన సమావేశంలో బిజెపి చీఫ్ జైస్వాల్ కోరారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంటుంది. రెండు రోజుల క్రితం ఉరవకొండ పట్టణంలో విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో జరిగిన ఘర్షణ కారణంగా ఈ గొడవ మరింత రాజుకుంది. వీరి కుటుంబంలో రెండు వర్గాలు ఉండగా గత ఎన్నికల్లో తన తండ్రి విశ్వేశ్వరరెడ్డి ఓటమికి విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, మరో సోదరుడి కుమారుడు నిఖిల్ నాథ్ రెడ్డి కారణమని, ప్రత్యర్థి నాయకులతో కలిసి…