KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే శతకాన్ని బాదిన రాహుల్, ప్రస్తుతం 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆవిష్కరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తరఫున ఒక బ్యాటర్ సాధించిన అత్యున్నత వ్యక్తిగత స్కోరుగా ఇది రికార్డు సృష్టించింది.
పంత్ రికార్డు కనుమరుగు..
గతంలో ఢిల్లీ తరఫున అత్యధిక స్కోరు రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2018లో ఇదే మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంత్ 128 పరుగులు చేయగా, రాహుల్ తన తాజా ఇన్నింగ్స్‌తో ఆ మార్కును అధిగమించి DC చరిత్రలో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. రాహుల్ కెరీర్‌లో ఇది ఆరవ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
వేగవంతమైన సెంచరీ…
రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని ఈ మ్యాచ్‌లో నమోదు చేశాడు. గతంలో 2022లో ముంబై ఇండియన్స్‌పై 56 బంతుల్లో సెంచరీ చేయగా, ఇప్పుడు దానిని 47 బంతుల్లోనే పూర్తి చేసి తన దూకుడును చాటాడు. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అభిషేక్ శర్మ రికార్డు బద్ధలు..
ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవలం ఢిల్లీ రికార్డులనే కాదు, ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 141 విషయంలో అభిషేక్ శర్మ నెలకొల్పిన రికార్డులను కూడా బద్ధలు కొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. ఆ రికార్డులను రాహుల్ 152 స్కోర్‌తో బద్దలు కొట్టాడు. భారత్ తరఫు నుంచి అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా ఇదే.
ఢిల్లీ క్యాపిటల్స్ జోరు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణయాన్ని రాహుల్ సరైనదని నిరూపించాడు. నితీష్ రాణా (90) అందించిన సహకారంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీకి, టేబుల్ టాపర్స్ పంజాబ్‌పై రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. రాహుల్ ఫామ్ రాబోయే మ్యాచ్‌ల్లో ఢిల్లీకి కీలక మారనుంది. తన క్లాస్ బ్యాటింగ్‌తో గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ ప్రేక్షకులను మైమరపించాడు. రాహుల్ సృష్టించిన ఈ సరికొత్త రికార్డులపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?