Maldives Row: ‘‘దయచేసి విమాన బుకింగ్స్ ఓపెన్ చేయండి’’.. ‘ఈజ్‌మైట్రిప్’కి మాల్దీవ్స్ సంఘం వేడుకోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగింది. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేయడంపై భారతీయులు భగ్గుమన్నారు. ఇటీవల ప్రధాని లక్షద్వీప్ వెళ్లిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాల్దీవుల మంత్రులు వివాదాస్పద పోస్టులను పెట్టారు. దీంతో చాలా మంది భారతీయ పర్యాటకులు మాల్దీవ్స్ యాత్రల్ని రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే 10 వేల హోటల్ బుకింగ్స్‌తో పాటు ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ బుకింగ్, టూరిజం ప్లాట్‌ఫామ్ ‘ఈజ్‌మైట్రిప్’ మాల్దీవులకు సంబంధించి ఫ్లైట్ రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయంపై మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్(MATATO) మంగళవారం ఈజ్‌మైట్రిప్‌కి మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని కోరింది. ఇది సాధారణ మాల్దీవ్స్ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే వ్యాఖ్యలు కానది అన్నారు. కోవిడ్ తర్వాత తమ దేశానికి వచ్చిన టూరిస్టుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారని, వారు తమ దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడ్డారని ఈజ్‌మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టిని ఉద్దేశిస్తూ చెప్పింది.
Also Read
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్‌పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
Read Also: High Court: అత్యాచార బాధితురాలు 8 నెలల ప్రెగ్నెన్సీ తొలగించుకునేందు కోర్టు అనుమతి..
‘‘మాల్దీవ్స్, భారత్ మధ్య సంబంధాన్ని నిర్వహించే శాశ్వత స్నేహం మరియు భాగస్వామ్యానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా దేశాలను రాజకీయాలకు అతీతంగా కలిపే బంధాలను మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము మా భారతీయులను ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులుగా పరిగణిస్తాము.’’ అని MATATO చెప్పింది. పర్యాటక రంగమే మాల్దీవులకు జీవనాధారం, మా జీడీపీలో మూడింట రెండొంతులకు పైగా సహకారం అందిస్తోంది. ఈ రంగంలో పనిచేసే సుమారు 44,000 మంది మాల్దీవులకు జీవనోపాధిని అందిస్తోందని, పర్యాటకంపై ప్రభావం చూపించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై పరిణామాలను కలిగించే శక్తి ఉందని తన ప్రకటనలో తెలిపింది.
మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారత్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. గత రెండేళ్లలో 4.5 లక్షల మంది ఈ దేశానికి వెళ్లారు. కరోనా సమయంలో కూడా 63,000 మంది భారతీయులు మాల్దీవ్స్‌ని సందర్శించారు. ఈ సమయంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి భారత టూరిస్టులు కారణమయ్యారు. అయితే తాజాగా అధికారం చేపట్టిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల విధానాన్ని అవలంభిస్తుండటం భారత్‌కి కోపం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి మంత్రులు ప్రధాని మోడీపై వివాదాస్పద కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.
తాజావార్తలు
-
Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
-
JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
-
Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
-
Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
-
Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!