Uddhav Shiv Sena: ఉద్ధవ్‌పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- నిధుల కోసమే తిరుగుబాటు చేశాము..
- ఏక్నాథ్ షిండే శివసేనలో చేరుతున్నాము..
- ఒక శివసేన నుంచి మరో శివసేనలోకి వెళ్తున్నాము..
- క్లారిటీ ఇచ్చిన ఉద్ధవ్ వర్గం ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా షిండే శివసేనలో చేరడంపై స్పష్టత వచ్చింది. తిరుగుబాటు చేసిన ఉద్ధవ్ వర్గం ఎంపీలు త్వరలో ఏక్నాథ్ షిండే శివసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్ వెల్లడించారు. తన లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులకు నిధుల కొరత ఏర్పడిందని, అందుకే అధికార కూటమి శివసేనలో చేరుతున్నట్లు నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
హింగోలి ఎంపీ అయిన అష్టికర్ మాట్లాడుతూ.. తమకు ఉద్ధవ్ ఠాక్రే అంటే కోపం లేదని, నిధుల కోసమే షిండే శివసేనలో చేరుతున్నామని చెప్పారు. తాము సిద్ధాంతం విషయంలో రాజీ పడలేదని ఒక శివసేన నుంచి మరో శివసేనలో చేరుతున్నామని వెల్లడించారు. తనతో పాటు మరొకొందరు ఎంపీలు జూన్ 18వ తేదీ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ తమకు వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల వల్లే మనసు మార్చుకున్నట్లు తెలిపారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
తమపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అవమానకరమైన భాష ఉపయోగించారని, ఆయన మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తనను ఎన్నుకున్న ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అభివృద్ధి విషయంలో ఎంపీల్యాడ్ రూ. 5 కోట్ల నిధులు సరిపోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారని, అందుకే మాకు నిధులు కావాలని అన్నారు. ఉద్ధవ్ శివసేనకు మొత్తం 9 మంది ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరిలో ఎంపీలు సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ వాక్చౌరే, నాగేష్ పాటిల్-అష్టికర్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?