Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
- యూపీలో వైరల్‌గా హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం..
- ఇరు కుటుంబాలతో 6 గంటల పాటు చర్చించి ఒప్పించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి పెళ్లి వైరల్‌గా మారింది. ఈ మతాంతర వివాహం ముందుగా రెండు వర్గాల్లో ఉద్రిక్తలు పెంచినప్పటికీ, చివరకు అమ్మాయి తండ్రి వివాహానికి ఒప్పుకోవడంతో శుభం కార్డ్ పడింది. మొత్తం ఈ వివాహంలో పోలీసులు పెళ్లి పెద్దలుగా నిలిచారు. ముస్లిం యువతి సానియా బానో, హిందూ యువకుడు అమన్ కుమార్ల కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. దావూద్‌పూర్ గ్రామానికి చెందిన ఇరు కుటుంబాలు ఇరుగుపొరుగున ఉంటాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా విషయం తెలుసుకున్న సానియా బానో తండ్రి ఖుర్షీద్ ఆలం పెళ్లికి నిరాకరించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిచి, దాదాపుగా 6 గంటల పాటు చర్చించి, ఇరు పక్షాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు తన కుమార్తె సంతోషమే ముఖ్యమని భావించిన ఖుర్షీద్ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తర్వాత సానియా, అమన్ సమీపంలోని ఆలయంలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. తన ఇష్టపూర్వకంగానే అమన్‌ను పెళ్లి చేసుకున్నట్లు సానియా అఫిడవిట్ సమర్పించింది. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా నోటరీ అఫిడవిట్ కూడా సిద్ధం చేశారు. గ్రామానికి చెందిన ఖుర్షీద్ ఆలం, అమర్ బహదూర్ ఈ వివాహానికి సాక్షులుగా నిలిచారు.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ఈ అంతర్-మత వివాహం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వివాహ వేడుకకు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్‌లకు చెందిన అధికారులు, కార్యకర్తలు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి మనీష్‌కుమార్ రావత్, బీజేపీ నేత విజయ్‌సింగ్ బజరంగీ, బజరంగ్ దళ్ జిల్లా సమన్వయకర్త ప్రిన్స్ బర్వాల్, శివకుమార్ సోని, కృష్ణపాల్, బబ్లూ గౌతమ్, నన్హే గౌతమ్, రాజేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!