Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
- లెబనాన్‌లో హిజ్బుల్లాను ఆపండి..
- చర్యలు విఫలమైతే తీవ్రంగా దాడి చేస్తాం..
- ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఒక వైపు కొనసాగుతుంటే, మరోవైపు ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్‌లో ఇరాన్ ప్రాక్సీ హిజ్బుల్లాను వెంటనే ఆపాలని, లేదంటే గత వారం చేసినట్లే, ఈ సారి మరింత తీవ్రంగా ఇరాన్‌ను దెబ్బతీస్తామని హెచ్చరించారు. చర్చలు విఫలమైతే ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తామని, హార్ముజ్‌ను ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ఈ పోస్ట్ చేశారు. ప్రాంతీయ భద్రత, హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, పలు రంగాలలో కాల్పుల విరమణలపై విస్తృత చర్చలు నడుస్తున్న సమయంలో ఈ హెచ్చరికలు రావడం గమనార్హం.
ప్రస్తుతం చర్చలు లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడుల పైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్, పాకిస్తాన్, ఖతార్‌లతో జరిగిన చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. లెబనాన్‌లో కాల్పుల విరమణ పరిరక్షించేందుకు ట్రంప్ ప్రభుత్వం పురోగతి సాధించిందని, అయితే పరిస్థితి ఇప్పటికీ సున్నితంగానే ఉందని చెప్పారు. విస్తృత ప్రాంతీయ సంధిని సాధించడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని, లెబనాన్ కాల్పుల విరమణ ఒక పరిష్కారం దిశగా కీలకమైన అడుగుగా భావిస్తున్నట్లు వాన్స్ చెప్పారు. అమెరికాను చిరాకు పరిచే విధానాలను ఇరాన్ విడిచిపెడితే, ఆ దేశంతో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
అయితే, ఇరాన్ షరతులు నెరవేరితే తప్పా, చర్చల తదుపరి దశకు వెళ్లేందుకు సిద్ధిగా లేదు. కీలకమైన చర్చల్లో అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలు, లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడుల్ని ఆపడం కీలకంగా మారాయి. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య దాడులు ఆపడంతో అమెరికా విఫలమైందని ఇరాన్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ప్రపంచ చమురుకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండటం చర్చల్ని సంక్లిష్టంగా మార్చాయి.
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?