JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- నాకు ఇష్టమైన వ్యక్తులో భారతీయురాలు, పాకిస్తానీ..
- భార్య ఉషా వాన్స్‌తో పాక్ ఆర్మీ చీఫ్‌తో పోలిక..
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Vance: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు అని, వారిలో ఒకరు భారతీయురాలైన తన భార్య ఉషా, రెండో వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అని అన్నారు. గత మూడు నెలల్లో అసిమ్ మునీర్‌తోనే ఎక్కువ మాట్లాడానని చెప్పారు. మునీర్ అమెరికాకు మంచి మిత్రుడని, మంచి దౌత్యవేత్త అని వాన్స్ కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. భార్యను పాక్ ఆర్మీ చీఫ్‌తో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఈ రోజు మనం ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చిస్తున్నామని, అన్ని విభేదాలను పరిష్కరించకపోవచ్చని, కానీ దీని వల్ల మొదటిసారిగా అన్ని పక్షాలు ఒక జట్టుగా కూర్చున్నాయని అన్నారు. ముఖ్యమైన సమస్యల్ని ఎలా పరిష్కరించాలని, మెరుగైన భవిష్యత్తు వైపు ఎలా పయనించాలో అర్థం చేసుకోవడానికి ఈ చర్చలు సహాయపడుతాయని చెప్పారు. కొన్ని గంటల చర్చల్లో తాము గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
మధ్యప్రాచ్యంలో శాశ్వత కాల్పుల విరమణ అమలు చేయడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని వాన్స్ అన్నారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగేలా చూడటంతో పురోగతి చూశామని చెప్పుకొచ్చారు. శాంతి, శ్రేయస్సును ప్రోత్సహించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయగల భవిష్యత్తును ఇప్పుడు చూస్తున్నామని అన్నారు.
Americans are going to regret this statement so badly one day.
JD Vance says:
“I have joked that I have two very, very important people in my life. An Indian and a Pakistani. The Indian is my wife, and the Pakistani is Field Marshal Munir.” pic.twitter.com/0uEmpGg1vw
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 21, 2026
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?