Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే కొన్ని నిర్దిష్ట యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (Merchant Discount Rate) ఛార్జీలు విధించడంపై సుప్రీంకోర్టు స్పందించింది. అసలు ఏ చట్టబద్ధమైన ప్రాతిపదికన ఈ ఛార్జీలు విధిస్తున్నారు? వీటి ద్వారా ఎవరికి లాభం చేకూరుతుంది? ఈ డబ్బులు ఎవరెవరికి ఎలా పంపిణీ అవుతాయి? అని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లను వివరణ కోరింది. ఈ నూతన ఫీజు విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ ఛార్జీల అమలుపై వెంటనే స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరినప్పటికీ, న్యాయస్థానం దానికి నిరాకరించింది. సంబంధిత సంస్థలన్నీ తమ అఫిడవిట్లను దాఖలు చేసిన తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామని, ప్రస్తుతం ఈ ఛార్జీల చట్టబద్ధతపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
ఇంతకీ ఈ కొత్త యూపీఐ ఫీజుల గోల ఏంటంటే..?
దాదాపు ఆరేళ్ల పాటు ఉచితంగా సాగిన యూపీఐ సేవలకు ముగింపు పలుకుతూ, అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 పైన ఉండే కొన్ని వ్యాపార లావాదేవీలపై (P2M) 0.4 శాతం రుసుమును విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాధారణ వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు (P2P), అలాగే రూ. 2,000 కంటే తక్కువ మొత్తంలో ఉండే చిన్న చిన్న చెల్లింపులకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఈ ఫీజు గరిష్టంగా రూ. 300 దాటకూడదని పరిమితి విధించారు. అంతేకాకుండా రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం (పెట్రోల్/డీజిల్), వ్యవసాయ రంగాలు వంటి తక్కువ లాభాలు ఉండే కీలక రంగ్ల వ్యాపారులకు రూ. 2,000 పైబడిన లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి కేవలం రూ. 5 మాత్రమే ఫ్లాట్ ఫీజుగా నిర్ణయించారు.
Also Read
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
దీంతో న్యాయవాది అంజన్ దత్తా దాఖలు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ (PIL) దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న ఇచ్చిన నోటిఫికేషన్‌ను, సెప్టెంబర్ 15న ప్రకటించిన ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌ను ఈ పిల్ సవాలు చేస్తోంది. తగినంత చట్టబద్ధమైన భద్రతలు, పారదర్శకత లేదా ప్రజా సంప్రదింపులు లేకుండానే ఈ రుసుమును ప్రవేశపెట్టారని పిటిషన్లో ఆరోపించారు. రూ. 2,000 పైన ఉండే యూపీఐ లావాదేవీల ఫ్రేమ్‌వర్క్‌ను వెంటనే రద్దు చేయాలని లేదా నిలిపివేయాలని కోరారు. ఒకవేళ అది కుదరకపోతే పారదర్శకంగా చర్చలు జరిపి, గణాంకాలు, ప్రభావ అంచనాలను వెల్లడించి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రక్షణ కల్పిస్తూ కొత్తగా సమీక్ష చేపట్టాలని కోరారు.
తాజావార్తలు
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!