Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tax Raids: బాలీవుడ్లో మరోసారి ఐటీ (ఇన్కమ్ టాక్స్) శాఖ దాడులు కలకలం రేపాయి. సినిమాల నిర్మాణాల పేరుతో విదేశాలకు అక్రమంగా నిధులు తరలిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు, పన్ను ఎగవేతల అనుమానాలతో ముంబై ఇన్కమ్ టాక్స్ అధికారులు ఒకేసారి పలువురు ప్రముఖులు, నిర్మాణ సంస్థల ఇళ్లపై, ఆఫీసులపై మెరుపు దాడులు చేపట్టారు. ఈ దాడుల జాబితాలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పానోరమా స్టూడియోస్’ లాంటి పెద్ద పేర్లు ఉండటం విశేషం. వీరితో ముడిపడి ఉన్న దాదాపు 12 ప్రాంతాల్లో ముంబై ఐటీ విభాగానికి చెందిన వేర్వేరు బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
సినిమా షూటింగ్‌లు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ వ్యయాల సాకుతో భారీగా నిధులను విదేశాలకు తరలిస్తున్నట్లు ఐటీ శాఖకు కొద్దిరోజులుగా పక్కా సమాచారం అందుతోంది. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున పన్నుల అవకతవకలు, ఆర్థిక అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు బలంగా అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ రడార్‌లో నిలిచిన వారిలో సౌత్, బాలీవుడ్‌లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్, ‘పూజా ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై ఎన్నో భారీ చిత్రాలను తీసిన ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ, అలాగే ‘దృశ్యం’ ఫ్రాంచైజీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన ‘పానోరమా స్టూడియోస్’ ముఖ్యంగా ఉన్నాయి. ఒక్కసారిగా ఐటీ అధికారులు రంగంలోకి దిగడంతో సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం నెలకొంది. ఇక ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత, ఈ ఆర్థిక మోసానికి సంబంధించి ఐటీ శాఖ కీలకమైన విషయాలను వెల్లడించవచ్చని భావిస్తున్నారు.
Also Read
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
తాజావార్తలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!