Maharashtra: 13 మందిని చంపిన పులి పట్టుబడింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Tiger That Killed 13 Captured: మహారాష్ట్రలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. సీటీ-1గా పిలువబడుతున్న ఈ పులి గత కొంత కాలంగా మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలైన గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో పలువురిపై దాడి చేసి హతమార్చింది. ఈ ప్రమాదకరమైన పులిని గురువారం అధికారులు పట్టుకున్నారు. ఇప్పటివరకు 13 మందిని హతమార్చింది ఈ పెద్దపులి. గడ్చిరోలి జిల్లా వాడ్సా అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తోంది.
చంద్రపూర్ జిల్లాలోని వాడ్సాలో ఆరగురిని, భండారాలో నలుగురిని, బ్రహ్మపురి ఫారెస్ట్ రేంజ్ లో ముగ్గురిని పులి చంపింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) నాగ్‌పూర్ అక్టోబర్ 4న జరిగిన సమాచారంలో ఈ సీటీ-1 పులిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తాడోబా టైగర్ రెస్క్యూ టీమ్, చంద్రపూర్, నవేగావ్-నాగ్జిరా నుంచి ర్యాపిడ్ రెస్సాన్స్ టీములు, ఇతర యూనిట్లు పులిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఆపరేషన్ ప్రారంభించారు. గురువారం ఉదయం వాడ్సా అటవీ రేంజ్ లో దానిని పట్టుకున్నారు అధికారులు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: Kerala High Court: వివాహ రిజిస్ట్రేషన్‌కు “మతం” ప్రాతిపదిక కాదు..
పునరావాసం కోసం దీనిని 183 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్ పూర్ గోరేవాడ రెస్క్యూ సెంటర్ కు తరలించారు అధికారులు. సాధారణంగా పిల్లలను రక్షించుకోవడం లేదా..ప్రాణాలు కాపాడుకునే క్రమంలో మాత్రమే మానవులపై దాడులు చేస్తుంటాయి. చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలు పూర్తిగా అటవీ ప్రాంతాలతో నిండి ఉండటంతో పాటు దేశంలో ప్రముఖమైన ‘‘ తాడోబో టైగర్ రిజర్వ్’’ కూడా ఈ ప్రాంతంలోనే విస్తరించి ఉంది. దీంతో తరుచుగా ఈ రెండు జిల్లాల వాసులు పులుల దాడులకు గురవుతుంటారు.
ఇటీవల మనిషి మాంసానికి అలవాటు పడిన మ్యాన్ ఈటర్ పులిని బీహార్ లో కాల్చి చంపారు. ఈ పులి దాడిలో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. చంపారన్ జిల్లాలో వాల్మీకి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పలు గ్రామాలపై దాడులు చేస్తూ పలువురిని హతమార్చింది ఈ పులి. చివరకు ఇంట్లో నిద్రిస్తున్న వారిని కూడా ఈడ్చుకెళ్లి చంపేసింది. దీంతో బీహార్ ప్రభుత్వం దీనిపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఈ పులిని చంపేశారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..