165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
- లెనోవో లెజియన్ ట్యాబ్ Y700 AI (2026) చైనాలో అధికారికంగా విడుదల..
- 8.4 అంగుళాల 165Hz OLED డిస్ప్లే, 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ..
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, అడ్రినో 840 GPU ..
- 50MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు..
- 7,470mAh బ్యాటరీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo Legion Tab Y700: లెనోవో (Lenovo) నుండి కొత్తగా “లెజియన్ ట్యాబ్ Y700 AI (2026) (Legion Tab Y700 AI (2026))” టాబ్లెట్ అధికారికంగా విడుదల అయ్యింది. గతేడాది విడుదలైన Y700 మోడల్‌కు కొనసాగింపుగా ఈ కొత్త టాబ్లెట్‌ను తీసుకొచ్చింది. అధిక పనితీరు, గేమింగ్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ టాబ్లెట్ ఇప్పటికే చైనాలో విక్రయానికి వచ్చింది.
OLED డిస్ప్లే:
ఈ కొత్త టాబ్లెట్‌లో 8.4 అంగుళాల OLED డిస్ప్లేను అందించారు. ఇది 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్, 3400Hz వరకు ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిస్ప్లే గరిష్ఠంగా 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. డాల్బీ విజన్ కు కూడా సపోర్ట్ ఉంది. ఈ టాబ్లెట్ మందం కేవలం 6.5mm కాగా, బరువు సుమారు 298 గ్రాములు. చేతిలో సౌకర్యవంతంగా ఉపయోగించుకునేలా రౌండెడ్ కార్నర్లతో డిజైన్ చేశారు. ఐస్ వైట్, క్లౌడ్ పర్పుల్, క్లౌడ్ టైడ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ప్రాసెసర్:
టాబ్లెట్ పనితీరు విషయానికి వస్తే.. ఇందులో 3nm ఆధారిత స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 840 GPU అందించారు. 12GB, 16GB, 24GB LPDDR5T ర్యామ్ వేరియంట్లు ఉండగా, స్టోరేజ్ పరంగా 256GB, 512GB, 1TB UFS 4.1 ఆప్షన్లు ఉన్నాయి. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. కంపెనీ ప్రకారం ఈ టాబ్లెట్ AnTuTu బెంచ్‌మార్క్‌లో ఏకంగా 45,85,844 పాయింట్ల స్కోర్ సాధించింది. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి హెవీ టాస్క్‌ల కోసం అధిక పనితీరును అందించేలా దీనిని రూపొందించారు.
కెమెరా & కూలింగ్ సిస్టమ్:
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. USB టైపు-C ఆడియో సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. పనితీరు సమయంలో టాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు మూడో తరం Qiankun కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో సుమారు 15,000mm² విస్తీర్ణం కలిగిన వేపర్ ఛాంబర్ (VC) ఉంది. టాబ్లెట్ మధ్యభాగంలో కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువసేపు గేమింగ్ చేసినా పనితీరు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G డ్యూయల్ SIM డ్యూయల్ స్టాండ్ బై (DSDS) సపోర్ట్ ఉంది. N79 బ్యాండ్‌కు కూడా అనుకూలత ఉంది. హారిజాంటల్, వర్టికల్ ఓరియంటేషన్లోనూ సిగ్నల్ స్థిరంగా ఉండేందుకు మల్టీ-యాంటెన్నా సెటప్‌ను అందించారు. కాలింగ్, మొబైల్ డేటా రెండింటినీ ఉపయోగించుకోవచ్చు. టాబ్లెట్‌లో రెండు USB టైపు-C పోర్టులు ఉన్నాయి. వీటిలో ఒకటి USB 3.2 Gen 2 వేగంతో పనిచేయడంతో పాటు “డిస్ప్లేపోర్ట్” వీడియో అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది. మరో USB టైపు-C పోర్ట్ USB 2.0కు సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ & AI ఫీచర్లు:
పవర్ బ్యాకప్ కోసం 7,470mAh బ్యాటరీని అందించారు. ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో పాటు రెండు X-ఆక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్లు ఉన్నాయి. సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత ZUI 16పై ఈ టాబ్లెట్ పనిచేస్తుంది. ఇందులో AI వాయిస్ అసిస్టెంట్, రియల్‌టైమ్ సిమల్టేనియస్ ఇంటర్‌ప్రిటేషన్, యాక్టివ్ సెన్సింగ్, కాంటెక్స్ట్ ఆధారిత సెలెక్షన్ సెర్చ్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. అదనపు ఉపయోగం కోసం స్టైలస్, గేమ్ కంట్రోలర్, ఆర్కేడ్ డాక్ వంటి యాక్సెసరీలను కూడా టాబ్లెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.
ధర:
ప్రస్తుతం ఈ టాబ్లెట్ చైనాలో అమ్మకాలకు అందుబాటులో ఉంది. తొలి సేల్ సమయంలో ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు లెనోవో తెలిపింది. భారత్‌లో ఈ టాబ్లెట్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై ప్రస్తుతం స్పష్టమైన సమాచారం లేదు. చైనాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి..
* 12GB RAM + 256GB స్టోరేజ్: 5,499 యువాన్ (రూ.78,070).
* 16GB RAM + 512GB స్టోరేజ్: 6,499 యువాన్ (రూ.92,270).
* 24GB RAM + 1TB స్టోరేజ్: 8,499 యువాన్ (రూ.1,20,660).
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!