Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మృతులందరూ చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నారు. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాబుతో పాటు మరో ఆరుగురు మృతి చెందారు.
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ప్రమాద ఘటనా స్థలిలోనే నలుగురు మృతి చెందారు. ఇద్దరు గుంటూరు జీజీహెచ్‌లో, ఒకరు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతులు మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, మరియమ్మ, సువార్తలుగా గుర్తించారు. ఆటోడ్రైవర్ అకస్మాత్తుగా టర్గ్ తీసుకోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!