10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
- సుజుకి ఎలక్ట్రిక్ కీ కార్ e-Sky ప్రొడక్షన్-రెడీ వెర్షన్ విడుదల..
- జపాన్ కీ కార్ నిబంధనలకు అనుగుణంగా..
- ఎత్తైన బాడీ, చిన్న ఫుట్‌ప్రింట్‌తో బాక్సీ డిజైన్..
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suzuki e-Sky: సుజుకి (Suzuki) నుండి మొదటి అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కీ కార్ e-Skyను ప్రొడక్షన్-రెడీ వెర్షన్లో లాంచ్ చేసింది. జపాన్ కీ కార్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు.. యునైటెడ్ కింగ్డమ్ సహా అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ క్యాబిన్లో ఎక్కువ స్థలాన్ని అందించేలా నిటారుగా, బాక్సీ ఆకృతిలో దీన్ని డిజైన్ చేశారు.
బాక్సీ డిజైన్:
గతేడాది టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన e-Sky కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్ వెర్షన్ చాలా దగ్గరగా ఉంది. అయితే భారీ ఉత్పత్తికి అనుగుణంగా కొన్ని డిజైన్ మార్పులు చేశారు. కాన్సెప్ట్‌లో ఉన్న సంక్లిష్టమైన LED లైటింగ్ సెటప్ స్థానంలో మరింత సింపుల్‌గా, బలమైన డిజైన్ కలిగిన లైటింగ్ యూనిట్లను అందించారు. ఎత్తైన బాడీ, చిన్న పొడవు, వెడల్పుతో కూడిన కాంపాక్ట్ ప్రొఫైల్ e-Sky ప్రధాన ప్రత్యేకతలు. నిటారుగా ఉండే కీ కార్ డిజైన్ కారణంగా చిన్న ఫుట్ప్రింట్లోనే క్యాబిన్ స్పేస్‌ను గరిష్ఠంగా వినియోగించుకునేలా రూపొందించారు. క్యాబిన్లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. EV కోసం ప్రత్యేకంగా రూపొందించిన కనెక్టెడ్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది.
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
రేంజ్:
సుజుకి e-Skyలో ఫ్రంట్-వీల్ డ్రైవ్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించనున్నట్లు సమాచారం. ఇది సుమారు 63 bhp పవర్ ఉత్పత్తి చేయనుంది. జపాన్ కీ కార్ నిబంధనల్లోని పరిమితులకు అనుగుణంగా ఈ పవర్ అవుట్‌పుట్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 310 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ అందించే అవకాశం ఉంది. దీంతో రోజువారీ నగర ప్రయాణాలు, చిన్న దూరాల కమ్యూటింగ్‌కు ఈ కారు అనుకూలంగా ఉండనుంది.
కాంపాక్ట్ కొలతలు:
సుజుకి e-Sky పొడవు 3,395mm, వెడల్పు 1,475mm, ఎత్తు 1,625mmగా ఉంది. వీల్‌బేస్ 2,460mm. కారు కెర్బ్ వెయిట్ 1,030 కిలోలు కాగా, టర్నింగ్ రేడియస్ కేవలం 4.4 మీటర్లు. ఈ కొలతలు ముఖ్యంగా రద్దీగా ఉండే నగర రోడ్లలో, ఇరుకైన వీధుల్లో డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో బ్యాటరీ పవర్‌ను సమర్థంగా వినియోగించుకునేందుకు డైరెక్ట్ హీట్-పంప్ సిస్టమ్, ఎయిర్-హీటెడ్ ఎలక్ట్రిక్ హీటర్‌ను కూడా అందించారు. క్యాబిన్‌ను వేడిగా ఉంచడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే వీటి ఉద్దేశం.
ధర:
యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో సుజుకి e-స్కై ధర 20,000 పౌండ్ల కంటే తక్కువగా ఉండనుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.26.08 లక్షలకు సమానం. ఈ ధరతో సుజుకి స్విఫ్ట్‌కు దగ్గరగా ఉండే కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో e-స్కై పోటీ పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!