Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
- మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం
- ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్
- షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు సోమవారం ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
శివసేనలో చేరిన ఎంపీలలో సంజయ్ హరిభావు జాధవ్, భౌసాహెబ్ రాజారామ్ వాఖ్చౌరే, ఓంప్రకాశ్ భూపాల్‌సింగ్ నింబాల్కర్, సంజయ్ దినా పాటిల్, సంజయ్ ఉత్తమ్‌రావు దేశ్‌ముఖ్, నాగేశ్ బాపురావు పాటిల్ అష్టికర్ ఉన్నారు. వీరిలో నింబాల్కర్, అష్టికర్ ఇప్పటికే ఆదివారం షిండే వర్గంలో చేరనున్నట్లు ప్రకటించారు.
Also Read
- India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
- Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
- Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
ఈ సందర్భంగా ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘‘ఈ ఆరుగురు పులులు ఇప్పుడు నిజమైన శివసేన కుటుంబంలో చేరారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. 2022లో మేము శివసేనను, విల్లు-బాణం గుర్తును కాపాడేందుకు తిరుగుబాటు చేశాం. ఇప్పుడు ఆ పోరాటం రెండో దశ ప్రారంభమైంది.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలు మాకు స్పష్టమైన జనాదేశం ఇచ్చారు. మేము బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం. వేరే భావజాలాన్ని అనుసరించిన వారిని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందుకే అందరూ మా శివసేనలో చేరుతున్నారు.’’ అని అన్నారు.
కొత్త మలుపు
2022లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు కారణంగా శివసేన చీలిపోయింది. ఆ పరిణామాలతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి పార్టీపై, ఎన్నికల గుర్తుపై, బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వంపై రెండు వర్గాల మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. భారత ఎన్నికల సంఘం షిండే వర్గాన్నే అధికారిక శివసేనగా గుర్తించడంతో ఆయన రాజకీయంగా మరింత బలపడ్డారు. తాజాగా ఆరుగురు ఎంపీలు చేరడంతో పార్లమెంట్లో కూడా షిండే శక్తి పెరిగినట్లైంది.
ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గంపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!