మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోయింది. దీంతో ఆయనతో పాటు మరో ఐదుగురు చనిపోయారు. ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు చనిపోయినట్లుగా డీజీసీఏ ప్రకటించింది.
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి దగ్గర ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. విమానం పూర్తిగా బూడిదైంది. సంఘటనాస్థలికి స్థానికులు భారీ ఎత్తున తరలివచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తరలివచ్చి మంటలు ఆర్పారు. విమానం అయితే పూర్తిగా కాలిపోయింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ముంబై నుంచి బారామతికి వస్తుండగా ఉదయం 8:45 గంటలకు కూలిపోయినట్లుగా సమాచారం. ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి వెళ్లే క్రమంలో క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని విమానం బూడిదైపోయింది. ప్రమాద దృశ్యాలను చూస్తుంటే.. ప్రమాద తీవ్రత ఏ రేంజ్లో అర్థమవుతోంది.
Ajit Pawar’s aircraft made a crash-landing. As per initial information, 4–5 people are reported injured. Official confirmation is awaited.#AjitPawar #BreakingNews #PlaneLanding #Update pic.twitter.com/AWhuAJhO5V
— Anuvesh Rath (@AnuveshRath) January 28, 2026