Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగం వెళ్తున్న బస్సు, లారీ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మొత్తంగా 15 మంది చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తెలంగాణ హైదరాబాద్ నుంచి బస్సు ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు వెళ్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో రేవా సమీపంలోని సుహాగీ హిల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు అంతా యూపీ వాసులే. ప్రయాణ సమయంలో బస్సులో మొత్తం 100 మంది వరకు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: Shruti Haasan: హాలీవుడ్ కు వెళ్తున్న శ్రుతి హాసన్
Also Read
క్షతగాత్రులను రేవాలోని సంజయ్ గాంధీ ఆస్పత్రితో పాటు మరికొంత మందిని ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వెళ్లే వారు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెనువెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకుపోయిన వారిని రక్షించారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు వీరంతా సొంత ఊళ్లకు బయలుదేరారని పోలీసులు తెలిపారు.
Madhya Pradesh | 14 dead, 40 injured in a collision between a bus and trolley near Suhagi Hills in Rewa. The bus was going from Hyderabad to Gorakhpur. All people on the bus are reportedly residents of Uttar Pradesh. pic.twitter.com/cwN2MUCB7O
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 22, 2022
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!