Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగం వెళ్తున్న బస్సు, లారీ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మొత్తంగా 15 మంది చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.