ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! ఐఎండీ వార్నింగ్

పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Read Also: అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌.. మంత్రి, మరో ఎమ్మెల్యే రాజీనామా..

రానున్న నాలుగైదు రోజుల పాటు అరేబియా, బంగాళాఖాతం నుంచి గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ.. వీటి ప్రభావంతో.. పలు రాష్ట్రాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ నెల 14వ తేదీ వరకు విదర్భ, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, హర్యానాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలింది… రానున్న రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్‌లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందన్న ఐఎండీ.. 11, 13 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని.. 13న విదర్భలో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో వర్షం కురవవచ్చునని అంచనా వేసింది.. ఇక, 11న చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, గంగానది పశ్చిమ బెంగాల్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 12వ తేదీన తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. 11, 12, 13 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో చాలా విస్తృతమైన వర్షపాతం, మంచు కురిసే అవకాశం ఉంటుందని, 12, 13 తేదీల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ.

Related Articles

Latest Articles