IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
- ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ
- నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసిపట్టిన ఆర్సీబీ
- ఆర్సీబీకి రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ
- ఐపీఎల్ 2025 అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజేతగా నిలిచింది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఫైనల్లో భంగపడ్డ బెంగళూరు.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో అటు ప్లేయర్స్, ఇటు ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇక ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
ఐపీఎల్ 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్‌కు రూ.12.5 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. క్వాలిఫయర్స్ జట్టుకు రూ.7 కోట్లు, ఎలిమినేటర్ టీంకు రూ.6.5 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీతో పాటు ఇతర అవార్డులు కూడా ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటిలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఫెయిర్ ప్లే అవార్డు, ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, బెస్ట్ క్యాచ్, అత్యధిక సిక్సర్లు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ వంటి అవార్డులు ఉంటాయి. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Also Read: Virat Kohli IPL Trophy: ఐపీఎల్ కప్‌తో కోహ్లీ.. రచ్చ మాములుగా లేదుగా!
అవార్డ్స్ ఫుల్ లిస్ట్:
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ – జితేష్ శర్మ (లక్ష రూపాయలు)
ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్ – శశాంక్ సింగ్ (లక్ష రూపాయలు)
ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ సిక్సర్లు – శశాంక్ సింగ్ (లక్ష రూపాయలు)
ఫైనల్ మ్యాచ్ గ్రీన్ డాట్ బాల్స్ – కృనాల్ పాండ్య (లక్ష రూపాయలు)
ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – కృనాల్ పాండ్య (రూ. 5 లక్షలు)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – సాయి సుదర్శన్ (రూ. 10 లక్షలు)
సీజన్ సూపర్ స్ట్రైకర్ – వైభవ్ సూర్యవంశీ (టాటా కర్వ్)
ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్ – సాయి సుదర్శన్ (రూ. 10 లక్షలు)
సీజన్ సూపర్ సిక్స్‌లు – నికోలస్ పూరన్ (రూ. 10 లక్షలు)
సీజన్ గ్రీన్ డాట్ బాల్స్ – మొహమ్మద్ సిరాజ్ (రూ. 10 లక్షలు)
సీజన్ బెస్ట్ క్యాచ్ – కమిండు మెండిస్ (రూ. 10 లక్షలు)
సీజన్ ఫెయిర్ ప్లే అవార్డు – చెన్నై సూపర్ కింగ్స్ (ట్రోఫీ)
సీజన్ పర్పుల్ క్యాప్ – ప్రసిద్ధ్ కృష్ణ (రూ. 10 లక్షలు)
సీజన్ ఆరెంజ్ క్యాప్ – సాయి సుదర్శన్ (రూ. 10 లక్షలు
సీజన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ – సూర్యకుమార్ యాదవ్ ( రూ. 15 లక్షలు)
సీజన్ బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు – ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (రూ. 50 లక్షలు)
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!