మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి అదృశ్యమైన జంటలో భర్త రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి భార్య సోనమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సెల్ ఫోన్ దొంగలించారనే అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం జోలపాలెంలో జరిగింది. సెల్‌ఫోన్ విషయంపై జరిగిన గొడవలో దంపతులపై ప్రత్యర్థి కొడవలితో దాడి చేసినట్లు తాలూకా పోలీసులు తెలిపారు.