TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..

  • మమతా బెనర్జీకి మరో షాక్..
  • టీఎంసీ సీనియర్ నేత మదన్ మిత్ర పార్టీకి రాజీనామా.
  • రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరిక.
Mamata Banerjee (1)

Mamata Banerjee (1)

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్‌(టీఎంసీ)కి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. ఈ పరిణామం మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఆమెకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కమర్హాటీ ఎమ్మెల్యే మదన్ మిత్ర బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ తిరుగుబాటు వర్గమైన రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు.

మీడియాతో మాట్లాడిన మదన్ మిత్ర.. ‘‘నేను ఇళ్లు మార్చలేదు. అసెంబ్లీతో నా గది మాత్రమే మార్చాను. నేను ఇప్పటికీ టీఎంసీలోనే ఉన్నాను’’ అని అన్నారు. టీఎంసీ ఒక విచ్ఛన్న పార్టీగా మారిందని విమర్శించారు. మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుంచి టీఎంసీ సంక్షోభం ముదిరింది. ఆ పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మందికి పైగా తిరుగుబాటు వర్గంలో ఉన్నారు. మే నెలలో మదన్ మిత్రను మమతా బెనర్జీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రెండు వారాలకే ఆయన రాజీనామా చేశారు. టీఎంసీ అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత మదన్ మిత్రా కూడా మమతాకు గుడ్ బై చెప్పారు. మరోవైపు, ఎంపీల్లో కూడా తిరుగుబాటు వచ్చింది. మొత్తం 28 టీఎంసీ ఎంపీల్లో 20 మంది విడిపోయి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు.