TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
- మమతా బెనర్జీకి మరో షాక్..
- టీఎంసీ సీనియర్ నేత మదన్ మిత్ర పార్టీకి రాజీనామా.
- రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. ఈ పరిణామం మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఆమెకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కమర్హాటీ ఎమ్మెల్యే మదన్ మిత్ర బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ తిరుగుబాటు వర్గమైన రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు.
మీడియాతో మాట్లాడిన మదన్ మిత్ర.. ‘‘నేను ఇళ్లు మార్చలేదు. అసెంబ్లీతో నా గది మాత్రమే మార్చాను. నేను ఇప్పటికీ టీఎంసీలోనే ఉన్నాను’’ అని అన్నారు. టీఎంసీ ఒక విచ్ఛన్న పార్టీగా మారిందని విమర్శించారు. మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుంచి టీఎంసీ సంక్షోభం ముదిరింది. ఆ పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మందికి పైగా తిరుగుబాటు వర్గంలో ఉన్నారు. మే నెలలో మదన్ మిత్రను మమతా బెనర్జీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రెండు వారాలకే ఆయన రాజీనామా చేశారు. టీఎంసీ అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత మదన్ మిత్రా కూడా మమతాకు గుడ్ బై చెప్పారు. మరోవైపు, ఎంపీల్లో కూడా తిరుగుబాటు వచ్చింది. మొత్తం 28 టీఎంసీ ఎంపీల్లో 20 మంది విడిపోయి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు.
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!