Delhi High Court: ‘‘ పరమశివుడికి మన రక్షణ అవసరం లేదు’’.. ఆలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: యమునా నదీ ఒడ్డున అక్రమం నిర్మించిన శివాలయం కూల్చేవేతపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులోకి దేవుడిని తీసుకురావడం సరికాదని కోర్టు పేర్కొంది. యమునా నదదీ ఒడ్డున ఉన్న ఆలయాన్ని కూల్చివేసే ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని గురువారం హైకోర్టు కొట్టేసింది. ‘‘శివుడికి ఎవరి రక్షణ అవసరం లేదని’’ అని పేర్కొంది. నదీగర్భంలో అనధికార పద్ధతిలో ఆలయాన్ని నిర్మించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఆలయం వరద ప్రాంతాలకు సమీపంలోని గీతా కాలనీలో ఉంది.
ప్రజలంతా శివుడి ఆశీర్వాదాలు కోరుకుంటున్నామని, శివుడికి మన రక్షణ అవసరం లేదు, యమునా నదీతీరం, వరద మైదానాన్ని ఆక్రమించి ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తే దేవుడికి మరింత ప్రీతికరంగా, సంతోషకరంగా ఉంటుందని జస్టిస్ ధర్మేష్ శర్మ నేతతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ కేసులో పరమశివుడిని కూడా చేర్చాలని పిటిషనర్ తరుపు న్యాయవాది విజ్ఞప్తి చేయడం, ఈ సమస్యకు భిన్నమైన రంగు పూయడానికి చేసే తీవ్రప్రయత్నం అవుతుందని కోర్టు మండిపడింది. నిత్యం వందలాది మంది భక్తులు ప్రార్థనలు చేసేందుకు వస్తున్నారని, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ ఆలయం కేంద్రంగా ఉందని పిటిషనర్ వాదించారు.
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
Read Also: Andhra Pradesh: జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను హ్యాండోవర్ చేసుకోనున్న జీఏడీ..
వివాదంలో ఉన్న భూమి పెద్ద ప్రజాప్రయోజనాల కోసం ఉద్దేశించబడిందని, పిటిషనర్ సొసైటీ దానిని ఆక్రమించడం, ఉపయోగించడానికి ఎలాంటి స్వాధీన హక్కులను క్లెయిమ్ చేయదని కోర్టు చెప్పింది. పిటిషనర్ సొసైటీ భూమిపై తన హక్కు లేదా ఆసక్తిని రుజువు చేసే పత్రాలను సమర్పించడంలో విఫలమైందని చెబుతూ, ఈ మందిరానికి ఏదైనా ‘చారిత్రక ప్రాముఖ్యత’ ఉందని నిరూపించలేదని కోర్టు అంగీకరించింది. ఇది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత ఆమోదించబడిన జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ లోని జోన్-o లోకి వస్తుందని కోర్టు పేర్కొంది.
ప్రతీ రోజూ ఆలయంలో ప్రార్థనలు జరుగుతాయనేది, కొన్ని పండగ సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయనే వాస్తవం ప్రశ్నార్థకమైన ఆలయాన్ని ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మార్చడని చెప్పింది. పిటిషనర్ సొసైటీ 15 రోజుల లోపు ఆలయ విగ్రహానలు వేరే ఆలయంలో ఉంచడంలో విఫలమైనతే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ) ఆ పనిచేయాలని కోర్టు ఆదేశించింది. అనధికార నిర్మాణాన్ని కూల్చేయడానికి డీడీఏకి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!