Site icon NTV Telugu

Lashkar-e-Taiba: ప్రధాని మోడీకి గుణపాఠం చెబుతారట.. పాక్ ఉగ్రవాది బలుపు మాటలు..

Modi

Modi

Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్‌లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.

Read Also: Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, సైఫుల్లా కసూరీ వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు చూపిస్తుంది. ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా వరదలకు కారణమైన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాది చెప్పడం వినవచ్చు. “మే 10, 2025న మనం చేసినట్లుగా ప్రధాని మోడీకి గుణపాఠం నేర్పించాలని మన సుప్రీం నాయకుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను నేను అభ్యర్థిస్తున్నాను” అని కసూరీ అన్నాడు.

సైఫుల్లా కసూరీ మాట్లాడుతూ.. భారతదేశం ‘‘జల ఉగ్రవాదం’’ చేస్తోందని, చెప్పచేయకుండా నీటిని విడుదల చేస్తూ, పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా వరదల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ నిలిపేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఇది యుద్ధ చర్యగా అభివర్ణిస్తామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గతంలో అన్నారు. 1960 నాటి ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంతో, పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Exit mobile version