భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన రెండో భార్య జ్యోతి సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో.. తనపై తన భర్త ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తన భర్త తనను నిర్లక్ష్యం చేశాడంటూ ఇన్ స్టా గ్రాం ద్వారా వీడియో రిలీజ్ చేసింది.
Read Also:Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క
భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లోనే రాణిస్తున్నాడు. ఇక ఇటీవల స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే.. హీరోయిన్ అంజలి రాఘవ్‌ను అసభ్యకరంగా తాకారు. దీంతో ఆమె భోజ్‌పురి ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో.. తప్పు చేసినట్లు ఒప్పుకుని ఆయన క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం పవన్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భార్య జ్యోతి సింగ్ ఆయనపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తీవ్ర ఆరోపణలు చేస్తూ వీడియో షేర్ చేసింది. తన భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని హోటల్‌కు వెళ్తున్నాడని తన ఇంటికి వెళ్తే తనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం రియాలిటీ వెబ్ సిరీస్ రైజ్ అండ్ ఫాల్‌లో కనిపిస్తున్న పవన్ సింగ్‌ను వేధింపులకు, మోసంకు పాల్పడ్డాడని జ్యోతి సింగ్ ఆరోపించారు.
తన భర్త పవన్ సింగ్ వేరే అమ్మాయితో హోటల్ కు వెళ్లడం తనకు నచ్చలేదని ఆమె తెలిపింది. అందుకే తాను ఇంటి నుంచి వెళ్లి పోయానని జ్యోతి సింగ్ తెలిపారు. గత సంవత్సరం తన వివాదాస్పద ఇమేజ్ కారణంగా బిజెపి నుండి తొలగించబడిన పవన్ సింగ్, నవంబర్ 6 నుండి ప్రారంభమయ్యే బీహార్ ఎన్నికలకు ముందు పార్టీలోకి తిరిగి వచ్చారు.
అంతకుముందు ఆయన ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా.. బీజేపీ సీనియర్ నేతలను కలిశారు. పార్టీ ఆయనను అర్రా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆయన ఆ నియోజకవర్గాన్ని సందర్శించే అవకాశం ఉంది.
తన భార్య ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియో వైరల్ అయిన తర్వాత.. పవన్ సింగ్ హిందీలో నోట్ పంపాడు. అందులో ఆమె తనను రాజకీయ మైలేజ్ కోసం వాడుకుంటుందని పవన్ సింగ్ ఆరోపించాడు.
“నా జీవితంలో నాకు ఒకే ఒక్క విషయం తెలుసు, ప్రజలే నాకు దేవుళ్ళు. నేను మీ అందరి మనోభావాలను దెబ్బతీస్తానా, ఎందుకంటే నేను ఇంత దూరం వచ్చాను? జ్యోతి సింగ్ జీ. నిన్న ఉదయం మీరు నా సొసైటీకి వచ్చినప్పుడు, నేను మిమ్మల్ని గౌరవంగా నా ఇంటికి ఆహ్వానించాను. మేము దాదాపు గంటన్నర మాట్లాడుకున్నామనేది నిజం కాదా?” అని ఆయన అడిగారు.