Farmers Protest: పంటకలు మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో సహా 12 డిమాండ్ల సాధనకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతు సంఘాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ‘‘ఢిల్లీ ఛలో’’ పేరుతో ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. బారికేట్లు, ముళ్ల కంచెలను దాటుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్న రైతులు, ఆందోళనకారులపైకి పోలీసులు టియర్ గ్యాస్ వదులుతున్నారు. డ్రోన్ల సాయంతో వీటిని ఆందోళనకారులపై పడేస్తున్నారు.
Rahul Gandhi: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టం, ఇతర డిమాండ్లలో 200 రైతు సంఘాలు ఢిల్లీ ఛలో మార్చ్‌కి పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ-హర్యానా సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ట్రాక్టర్లతో వచ్చిన రైతుల్ని పోలీసులు, కేంద్రబలాగాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా ఢిల్లీ వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి రుణమాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్ల పథకాన్ని…
Farmers protest: రైతులు తమ హామీలను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు 'ఢిల్లీ చలో' మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో భాగంగా రైతులు పెద్ద సంఖ్యలో హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులతో పాటు పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. 200 రైతు సంఘాలు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ), రైతు ఉద్యమ సమయంలో కేసులు ఎత్తివేయాలని, లఖీంపూర్ ఖేరీ బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ…
Farmers' protest: కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చ్ చేయనున్నాయి.