Mamata Banerjee: కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..
- కోల్‌కతా ఆస్పత్రి విధ్వంసం వెనక బీజేపీ-లెఫ్ట్ పార్టీలు..
- సాక్ష్యాలు తుడిచిపెట్టేందుకే దాడి..
- వైద్యురాలి హత్యాచారం కేసుపై మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దారుణానికి ఒడిగట్టానే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యులు రోడ్డెక్కారు. బాధితురాలికి మద్దతుగా ధర్నాలు, నిరసనలు తెలిపారు. ఇప్పటికే ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, గురువారం వైద్యులు నిరసన తెలుపుతున్న సందర్భంలో కొందరు దుండగులు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ ఘటనలో సీపీఎం, బీజేపీ దాని మిత్రపక్షాల ప్రమేయం ఉందని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు అన్నారు. ఈ రోజు బాధిత వైద్యురాలికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారం, హత్య వెనక ఉన్న నిజాన్ని మరుగునపరిచేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
Read Also: Satyakumar: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ..
నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ నిజాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ చర్యల్ని ఖండిస్తున్నామని, దోషుల్ని ఖఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి విధ్వంసం వెనక బీజేపీ, సీపీఎంలు ఉన్నాయని, సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి ఆస్పత్రిపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. బెంగాల్లో అశాంతి సృష్టించేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయని విమర్శించారు. చాలా వీడియోల్లో సీపీఎం, బీజేపీ జెండాలు ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆర్జీ కర్ ఆస్పత్రి దాడి వెనక టీఎంసీ గుండాలు ఉన్నారని, పోలీసులు వారికి సురక్షితమైన మార్గాన్ని అందించి పారిపోయాలా చేశారని బీజేపీ నేత సువేందు అధికారి ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిలో 25 మంది పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!